Andra Vamsi IAS : ఈ కలెక్టర్ రూటే సపరేటు.. ప్రతి ఫిర్యాదుకు ఒక డెడ్ లైన్.. ఆండ్ర వంశీ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
యూపీఎస్సీ పరీక్ష( UPSC Exam ) రాసి ఆ పరీక్షలో సక్సెస్ సాధించడం సులువు కాదు.
అలా ఎంతో కష్టపడి తన లక్ష్యాన్ని సాధించుకున్న యువకులలో ఆండ్ర వంశీ ఒకరు.
యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ జాబ్ సాధించిన ఆండ్ర వంశీ ఇతర ఐఏఎస్ ఆఫీసర్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఆండ్ర వంశీ ఐఏఎస్( Andra Vamsi IAS ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
2006 సంవత్సరంలో ఆండ్ర వంశీ కంప్యూటర్ సైన్స్ లో బీఏ పూర్తి చేశారు.
2008 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా చేరిన ఆండ్ర వంశీ దేశం కోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ తపనతో ఉండేవారు.
ఐఏఎస్( IAS ) కావడం ద్వారా పేదలకు అండగా నిలబడాలని ఆయన భావించారు.
2011 సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలో ఆయన పాస్ కావడంతో పాటు ఐఏఎస్ అయ్యారు.
లక్నోలో స్కిల్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టర్( Skill Development Mission Director ) గా కూడా ఆయన పని చేశారు.
"""/"/
ఎవరు ఏ సమస్యతో బాధ పడుతున్నా వాళ్ల దగ్గరికి వెళ్లి పరిష్కరించడం ఆయన ప్రత్యేకత.
నాలుగు నెలల్లో 50 వేల పెండింగ్ కేసులను పరిష్కరించారంటే ఈ కలెక్టర్( Collector ) పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.
30 ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో ప్రజల సమస్యలను సైతం ఆయన పరిష్కరించారంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుందని చెప్పవచ్చు.
"""/"/
క్లిష్టమైన కేసులను సైతం చాకచక్యంగా పరిష్కరించి ఆయన ప్రశంసలు అందుకున్నారు.
రోజూ డెడ్ లైన్( Deadline ) విధించుకుని పనులను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న ఆండ్ర వంశీ సక్సెస్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఇలాంటి కలెక్టర్లు ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆండ్ర వంశీ లాంటి కలెక్టర్లు నూటికో కోటికో ఒక్కరు ఉంటారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
పట్టుదలతో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రాజశేఖర్.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!