ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వివాదాస్పద లేఖ.. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ..
TeluguStop.com
ముస్లిములలో( Muslims ) సున్నీలు, షియాలు రెండు వర్గాలు ఉంటారని అందరికీ తెలుసు.
అయితే అహ్మదీయులు( Ahmadiyyas ) అనే మరో వర్గం ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు.
అయితే ఈ అహ్మదీయులు ముస్లిములు కాదని, వారు కాఫిర్లు అని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా( AP Waqf Board Chairman Khadar Basha ) ఇటీవల ఓ లేఖ రాశారు.
దీంతో వివాదం రాజుకుంది.దీనిపై సదార్ అంజూమన్ అహ్మదీయ సంస్థ మండిపడింది.
ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖపై వారు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఏపీలో తమకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు.
తర్వాత ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై కేంద్రం మండిపడింది.ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అహ్మదీయుల పట్ల కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది.
ఇది సరికాదని, సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదని పేర్కొంది.దీంతో ఈ అహ్మదీయులు ఎవరు? వారి నేపథ్యం ఏమిటనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
"""/" /
పంజాబ్ కేంద్రంగా 19వ శతాబ్దంలో ముస్లిం మతంలో పునరుజ్జీవన ఉద్యమం వచ్చింది.
అహ్మద్ బోధనలను పాటించే వారంతా అహ్మదీయులుగా పేరొందారు.వీరికి ఖాదియన్లు అనే పేరు కూడా ఉంది.
దేశ విభజన తర్వాత వీరిలో కొందరు పాకిస్తాన్‌కు( Pakistan ) వెళ్లారు.పాక్‌లోని సున్నీ తెగకు చెందిన వీరికి అక్కడ కనీస హక్కులు కూడా ఉండవు.
సమానత్వం కోసం వీరు అక్కడ పోరాడుతున్నారు.అయితే భారత్‌లో మాత్రం వీరు ఇతర ముస్లిముల మాదిరిగానే మైనార్టీ హక్కులను అనుభవిస్తున్నారు.
"""/" /
అయితే ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సదామన్ అంజూమన్ లేఖపై ప్రస్తుతం వివాదం రాజుకుంది.
ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వక్ఫ్ బోర్డ్ తీర్మానంగా భావించొద్దని వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖాదర్ వివరణ ఇచ్చారు.
అయితే వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌కు కొన్ని ముస్లిం సంస్థలు మద్దతు పలుకుతున్నాయి.జమాయత్ ఉలేమా-ఇ-హింద్ వంటి సంస్థ బాహాటంగా మద్దతు తెలిపింది.
ఇదిలా ఉండగా ఈ వివాదం తర్వాత పీ వక్ఫ్ బోర్డు కొత్త సీఈవోగా పి.
బషీర్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు విడుదల చేసింది.
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!