ఓకే గూగుల్ బాగా వాడేస్తున్న ఏపీ ప్రజలు.. దేశంలోనే నంబర్ 1

టెక్నాలజీని ఉపయోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి.

తక్కువ చదువుకున్న వారు కూడా స్మార్ట్ ఫోన్లను చాలా సులువుగా యూజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటికొచ్చింది.యూరోపియన్ టెక్ కంపెనీ Softbrik AI ఇటీవలి ఓ అధ్యయనం చేపట్టింది.

గూగుల్ ట్రెండ్స్ డేటాను ఉపయోగించి, వారు విశ్లేషించి ఓ నివేదిక విడుదల చేశారు.

అందులో కేవలం గూగుల్ వాయిస్ సెర్చింగ్ ఆప్షన్‌ను 2021 నుండి 2022 వరకు 78% పెరిగిందని వెల్లడించారు.

కంపెనీ 'ఓకే గూగుల్' లేదా 'హే గూగుల్' ఆదేశాలతో ప్రారంభమయ్యే సెర్చింగ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

దీనికి సంబంధించి భారత దేశానికి చెందిన ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి.వీటి గురించి తెలుసుకుందాం.

వాయిస్ సెర్చ్‌ను భారత దేశంలో అధికంగా వినియోగించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.

ఆ తర్వాత అండమాన్ నికోబార్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి.

ఈ జాబితాలో ఢిల్లీ, చండీగఢ్, కేరళ అట్టడుగు స్థానంలో నిలిచాయి.సాఫ్ట్‌బ్రిక్ సహ వ్యవస్థాపకులలో ఒకరైన రోమిత్ చౌదరి దీనిపై స్పందించారు.

"""/"/ అధిక మంది భారతీయులు టైప్ చేయడం కంటే వారి పరికరాలతో మాట్లాడటంలో సౌకర్యంగా ఉన్నారని చూపించడానికి ఈ అధ్యయనం ఒక గొప్ప సూచిక అని పేర్కొన్నారు.

అలెక్సా యొక్క వినియోగదారు ఆధారితమైన గూగుల్ మాత్రమే కాదని, సిరి వినియోగం కూడా పెరుగుతోందని అన్నారు.

అండమాన్ దీవుల వంటి దూరప్రాంతం లేదా ఢిల్లీ వంటి ప్రాంతాల్లోనూ వాయిస్ సెర్చింగ్‌పై ఎక్కువ మంది ఆధార పడుతున్నారు.

అలాగే వయస్సు వారీగా చిన్నవారు మాత్రమే కాకుండా వృద్ధులు కూడా వాయిస్‌ కమాండ్‌లను ఉపయోగిస్తున్నారు.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?