ఆత్మహత్యల్లో తెలుగు రాష్ట్రాల‌ది ఎన్నో స్థాన‌మో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న వారి సంఖ్య‌ భారీగా పెరిగిపోతుంది.ఏదో ఒక కార‌ణంతో తమ ప్రాణాన్ని తామే తీసుకుని.

బంగారం లాంటి భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంటున్నారు.ముఖ్యంగా జీవితంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక‌.

ఎంద‌రో ఆత్మ‌హ‌త్య వైపు మొగ్గుచూపుతున్నారు.ఇదిలా ఉంటే.

తాజాగా భార‌త్‌లో దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల చిట్టాను జాతీయ నేర గణాంక విభాగం (ఎస్‌సీఆర్‌బీ) విడుద‌ల చేసింది.

ఈ లెక్క‌ల్లో 6,7 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొద‌టి స్థానంలో నిలిచింది.ఇక్కడ 18 వేలకిపైగా ఆత్మహత్యలు న‌మోద‌య్యాయి.

రెండో స్థానంలో తమిళనాడు నిల‌వ‌గా.ఇక్క‌డ 13 వేలకుపైగా ఆత్మహత్య కేసులు న‌మోద‌య్యాయి.

12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో నిల‌వ‌గా.నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.7 వేల‌కు పైగా ఆత్మహత్యలతో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.

ఇక 6 వేల‌కుపైగా ఆత్మహత్యలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏడో స్థానంలో నిలిచింది.కాగా, ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.

దేశ‌వ్యాప్తంగా నమోదైన ఆత్మ‌హ‌త్య‌ల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?