ఏపీ రాజకీయం.. సోషల్ మీడియా హంగామాతో ఎంత వరకు ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్న విషయం తెలిసిందే.

ఏడాది సమయం ఉండగానే అధికార పార్టీ వైకాపా హడావుడి మొదలు పెట్టింది.మరో వైపు ప్రతిపక్ష పార్టీలు అయినా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు పొత్తు ల కోసం ప్రయత్నాలు, చర్చలు మొదలు పెట్టాయి.

మూడు పార్టీలు కూడా తమ సోషల్ మీడియా టీం ని ఈ మధ్య కాలం లో రెట్టింపు చేయడం జరిగిందట.

సోషల్ మీడియా లో మూడు పార్టీలు దేనికి అదే అంటూ విపరీతంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాయి.

అధికార పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కీర్తిస్తూనే మరో వైపు తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం.

మీమ్స్‌ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు. """/" / ఇక తెలుగు దేశం పార్టీ కి సోషల్ మీడియా( Social Media ) లో సుదీర్ఘ అనుభవం ఉంది.

దాంతో తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా టీం అధికార పార్టీ పై ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే విధంగా మీమ్స్‌ క్రియేట్ చేయడం జరుగుతుంది.

"""/" / సామాన్య జనాల్లో అధికార పార్టీ గురించి అన్ని విషయాలు తెలిసే విధంగా వైకాపా( YCP ) యొక్క అవినీతి పాలన అర్థం అయ్యే విధంగా తెలుగు దేశం పార్టీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి వైకాపా మరియు తెలుగు దేశం పార్టీలు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నాయి.

ఈ రెండు పార్టీలు మాత్రమే కాకుండా జనసేన పార్టీ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సమయం దొరికినప్పుడల్లా వాయించేస్తున్నారు.

మొత్తానికి మూడు పార్టీలు కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నంతగా హడావుడి చేస్తున్నారు.

ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

పీకల దాక తాగేసిన యువతి.. ఆ కంట్రీ ఫ్లైట్ తీసుకోబోయి తప్పు చేసిందే..?