ఏపీ ఎన్నారైల ఓట్లు ఎన్ని పోలయ్యాయంటే..!!!

2019 ఎన్నికల్లో ఎన్నారైలు తొలిసారిగా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.అమెరికా సహా వివిధ దేశాలలో ఉంటున్న ఎంతో మంది ఎన్నారైలు దాదాపు 5200 మంది గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ విషయాన్ని ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి వేమూరి తెలిపారు.అసలు ప్రవాసులకి ఇప్పటి వరకూ ఓటు హక్కు లేదు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎన్నారైలు ఓటింగ్ వేసే విధంగా కొత్తగా బిల్లుని తీసుకువచ్చింది.

కానీ అది రాజ్యసభలో ఆమోదం పొందలేదు.అయితే ఏపీఎన్‌ఆర్టీ ప్రోద్బలంతో అప్పటికే లక్షమందికిపైగా ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

వారిలో కొందరికి ఓట్లు కూడా వచ్చాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అమెరికా, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదలగు దేశాల నుంచీ వచ్చిన దాదాపు 5200 మంది నేరుగా ఓటు వేసేందుకు కొన్ని రోజుల ముందుగానే వచ్చారు.

ఆయా పార్టీల తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు కూడా.తమకి కూడా ఓటు వేసే అవకాశం కలిపించిన ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి వేమూరికి పలువురు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రేడియోయాక్టివ్ మెటీరియల్ వద్దకు వెళ్తే 5 నిమిషాల్లో మరణం తథ్యం..?