ఆన్‌లైన్‌లో శారీ ఆర్డర్ పెట్టాడు.. డెలివరీ ప్యాకేజీ ఓపెన్ చేసి చూడగా షాకింగ్ దృశ్యం!
TeluguStop.com
ఈ రోజుల్లో చాలామంది ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేస్తున్నారు.పళ్లు తోముకునే బ్రష్ నుంచి పడుకునే డబుల్ కాట్ వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నారు.
అయితే ఒక్కోసారి ఒకటి ఆర్డర్ పెడితే మరోటి రావడం ఆన్‌లైన్ షాపింగ్‌లో షరా మామూలు అయింది.
తాజాగా ఇలాంటి పొరపాటుకు మరో యువకుడు బాధితుడయ్యాడు.ఈ వ్యక్తి తన సిస్టర్‌కి చీరను బహుమతిగా ఇద్దామని ఆన్‌లైన్‌లో ఓ శారీని ఆర్డర్ పెట్టాడు.
మూడు రోజులకు అతడికి డెలివరీ వచ్చింది.దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో అతడికి చీరకు బదులుగా ఊహించని మరో ఐటెం కనిపించింది.
అంతే అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు.వివరాలలోకి వెళ్తే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఓ యువకుడు క్రిస్మస్ సందర్భంగా తన సోదరి కోసం ఓ చీరను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు.
ఒక ఆన్‌లైన్ యాప్ ద్వారా అతను రూ.550 ఖరీదు గల శారీ ఆర్డర్ చేశాడు.
మూడు రోజుల తర్వాత డెలివరీ బాయ్ అతని ఇంటికి వచ్చి ఒక పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు.
తర్వాత ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూడగానే అందులో చీరకు బదులుగా చిరిగిన జీన్స్ ప్యాంటు కనిపించింది.
అది కూడా సరిగ్గా లేదు. """/"/
ఆ ప్యాంటుకి ఒక కాలు మాత్రమే ఉంది.
ఇంకొక కాలు కట్ అయి ఉంది.దాంతో ఆ యువకుడికి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయింది.
ఆ తర్వాత తేరుకొని వెంటనే డెలివరీ బాయ్‌కు ఫోన్ చేయగా తనకు, దానికి ఎలాంటి సంబంధం లేదని, తాను జస్ట్ ఒక డెలివరీ బాయ్ మాత్రమేనని, కావాలంటే రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలని సూచించాడు.
అంతేకాదు ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతుంటాయని.అందుకే జాగ్రత్తగా ఉండాలని కూడా అతడు చెప్పాడట.
ఏదైనా పండుగ సందర్భంగా సిస్టర్‌ను సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న అన్నయ్యకి చివరికి నిరాశే మిగిలింది.
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది… ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!