కెసిఆర్ చేతిలో చిన్న గీతగా మారిన ఆంధ్ర ప్రదేశ్ !
TeluguStop.com
ఒక గీత చిన్నదో పెద్దదో ఎప్పుడు తెలుస్తుంది? దాని పక్కన మరో గీత చిన్నదో పెద్దదో ఉన్నప్పుడే తెలుస్తుంది.
ఆ గీత పక్కన ఉన్నది చిన్న గీత అయితే ఇది పెద్దగా కనిపిస్తుంది, అదే పెద్ద గీత అయితే ఇది చిన్నగా కనిపిస్తుంది .
ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీకి ఆంధ్రప్రదేశ్ అలాంటి చిన్న గీత గానే ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు .
తన ప్రభుత్వ పరిపాలన సామర్ధ్యాన్ని , తన సంక్షేమ పథకాల అమూల్య పలితాలను కేసీఆర్( CM KCR ) ఆంధ్రప్రదేశ్ తో పోల్చి తెలంగాణ ప్రజలకు సవివరంగా విశదీకరిస్తున్నారు.
ప్రతి రంగం లోనూ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి తో పోల్చి తమది ఎంత గొప్ప పరిపాలనో తనను ఎందుకు మరోసారి ఎన్నుకోవాలో ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు .
మౌలిక సదుపాయాల కల్పనలోను, పారిశ్రామిక అభివృద్ధిలోనూ, వ్యవసాయ రంగంలోనూ తన ప్రగతిని ప్రదర్శించుకోవడానికి రిక్టర్ స్కేలుగా ఆంధ్రప్రదేశ్ కెసిఆర్ కి ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తుంది .
ఇలా పదే పదే ఆంధ్రప్రదేశ్ ను చిన్న బుచ్చుతూ తెలంగాణ గొప్పతనాన్ని ఆయన ఓటర్ల ముందు ప్రదర్శిస్తున్నారు.
"""/" / ఇది ఒకరకంగా ఆ పార్టీ వరకూ సరైన ఎన్నికల ప్రణాళిక లాగానే కనిపిస్తున్నా నిన్నటి వరకూ కలసి మెలిసి నివసించిన సాటి తెలుగు రాష్ట్రాన్ని అవమానించ కూడదని అది ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్తాయికి తగదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి కేసీఆర్ వ్యాఖ్యలను ఎక్కడికక్కడ ఎదుర్కొని జవాబు చెప్పాల్సిన అధికార పక్ష నేతలు కూడా నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరించడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.
తెలంగాణ ఎన్నికలు పూర్తి అవ్వగానే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు ఉన్నాయి.
ఇప్పుడు అభివృద్ధి కేంద్రంగా కేసీఆర్ చేస్తున్న విమర్శలకు దీటైన జవాబు చెప్పలేకపోతే అది వచ్చే ఎన్నికలలో వైసిపి ( YCP )సర్కారుకు భారీ ప్రమాదంగా పరిణమిస్తుంది.
అయినా కూడా కెసిఆర్ తో ఉన్న స్నేహం చెడిపోకూడదు అనుకుంటున్నారో లేక కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ అధికార పక్ష నేతలు నుంచి మాత్రమే కనీస స్పందన కనిపించడం లేదు .
"""/" / చంద్రబాబు పైనో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పైనో ప్రెస్ మీట్ లు పెట్టి వారిని ఆపాదమస్తకం విమర్శించడం లో చూపే శ్రద్ద లో సగమైనా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వాఖ్యలకు జవాబు చెప్పడానికి కేటాయిస్తే బాగుటుంది అని అదికార పార్టీ పై సెటైర్లు పడుతున్నాయి .
మరి ఈ విషయం లో అధికార పార్టీ కి చీమకుట్టినట్టు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలంగాణ లో నివసిస్తున్న ఆంధ్ర మూలాలు ఉన్న ప్రజలకు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
విమానంలో సడన్‌గా దర్శనమిచ్చిన పాము.. ధైర్యం చేసిన ఆస్ట్రేలియన్ యాక్టర్..?