చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న రాజకీయ నాయకుడు ఎవరో గుర్తు పట్టారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి పేరు యడగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.2004వ సంవత్సరంలో జరిగిన  సార్వత్రిక ఎన్నికలల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దిగ్విజయం సాధించి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

అనంతరం వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు చదువుకోడానికి ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, పేదలకు పక్కా ఇళ్ళు, ఇలా ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టాడు.

దీంతో 2009వ సంవత్సరంలోని  ఎన్నికల్లో కూడా ప్రజల మన్ననలు పొంది మరోసారి ముఖ్య మంత్రిగా ఎన్నుకోబడ్డాడు.

 కానీ దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగినటువంటి విమాన ప్రమాదంలో మృతి చెందాడు.అయినప్పటికీ ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో ఆపద్బంధువుడిగా కొలువున్నాడు.

అయితే తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

  ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి (బ్రతికి ఉన్నప్పుడు) తన భార్య విజయలక్ష్మి మరియు తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో కొందరు వైకాపా అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.

 అంతేగాక ఈ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసిన కొద్ది కాలంలోనే లక్షల లైకులు, కామెంట్లు వచ్చాయి.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా తండ్రి మరణాంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా వైఎస్సార్ పార్టీ (యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ) ని స్థాపించాడు.

 దీంతో 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ అనుకోకుండా ఓటమి పాలయ్యాడు.

 దాంతో నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు శ్రమించాడు.

 దాంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్టించాడు.

 ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దూసుకుపోతున్నాడు.

అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్?