హీరో రామ్ పోతినేని కి ఏపీ మాజీ ముఖ్య మంత్రి సపోర్ట్…!

గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కుల చిచ్చు వివాదాలతో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ కుల చిచ్చులో రామ్ పోతినేని కి ఎలాంటి సంబంధం లేకపోయినా అతడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది సరికాదని ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు దేవినేని ఉమా తన మద్దతు ని రామ్ పోతినేని కి తెలిపాడు.

కాగా తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఇందులో భాగంగా గత పదేళ్లుగా రమేష్ హాస్పిటల్స్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని అలాంటి వారిపై ఇలాంటి వ్యక్తి గత విమర్శలు చేయడం సరికాదని ఆరోపనించారు.

అంతేగాక దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఇందులో భాగంగానే రామ్ పోతినేని తన భావాలను వ్యక్తం చేశాడని దాంతో కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇలా పరోక్షంగా వారిపై బెదిరింపులకు పాల్పపడడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ పోతినేని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న "రెడ్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసి వేయడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

జనసేన అలా చక్రం తిప్పబోతోందా ? అందుకేనా ఈ హ్యపీ ?