నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు .. జరగబోయేది ఇదే

ఏపీలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది.మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు.

వారికి శాఖల కేటాయింపు కూడా ఇప్పటికే పూర్తయింది.ఇక గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది.

దానికి నేడు ముహూర్తాన్ని నిర్ణయించారు.ఈ మేరకు నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Meetings ) ప్రారంభం కానున్నాయి.

ఈరోజు, రేపు సమావేశాలు జరుగుతాయి.ఈరోజు ఉదయం 9.

46 గంటలకు సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రొటెం స్పీకర్ నియామకం పై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేయనున్నారు.

ఆ తరువాత సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.ప్రమాణస్వీకారం అనంతరం రిజిస్టర్ లో సంతకం చేయనున్నారు.

"""/" / ప్రొటెమ్ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Buchaiah Chowdary ) వ్యవహరిస్తారు.

ఈ మేరకు నిన్ననే రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,( CM Chandrababu Naidu ) ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ప్రమాణస్వీకారం చేస్తారు .

ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో సభ్యులు చేత ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

"""/" / ఈరోజు కేవలం సభ్యుల ప్రమాణస్వీకార సమావేశం మాత్రమే జరుగుతుంది.ఇతర సమావేశాలు జరిగే అవకాశం లేదు.

దీంతో ఈరోజు విజిటింగ్ పాసులు జారీ చేయడం లేదు .ఎమ్మెల్యే ల కుటుంబ సభ్యులతో పాటు, ఎవరికి శాసనసభ సమావేశాలకు అనుమతించడం లేదని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు.

ఇది ఇలా ఉంటే నేటి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్( YS Jagan ) హాజరవుతారా లేదా అనేది క్లారిటీ లేదు.

ఎన్నికల్లో వైసిపి కేవలం 11 స్థానాలు మాత్రమే పరిమితం కావడంతో, జగన్ పూర్తిగా నిరాశ , నిస్పృహల్లో ఉన్నారు.

ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయరని, స్పీకర్ ఛాంబర్  ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?