రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటున్న ఆంధ్రా పార్టీలు

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన మణిపూర్( Manipur ) ఘటనపై విపక్షాలు ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే .

దీనికి ప్రతిపక్ష కూటమి ఇండియా ఉమ్మడిగా అవిశ్వాస తిర్మానాన్ని ప్రవేశపెడుతుంది.

దీనికి దేశ వ్యాప్తంగా పార్టీల వారి లభిస్తున్న మద్దతు ఏమిటా అని చూస్తే మెజారిటీ ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్నాయి.

ఇది వీగిపోయే తీర్మానం అని తెలిసినప్పటికీ కూడా ఈ ఘటన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలనే ఉద్దేశంతో మాత్రమే విపక్షాలు ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది .

మరి ఇలాంటి ప్రయత్నానికి మద్దత్తు ఇవ్వాల్సిన ఆంధ్ర ప్రదేశ్ పార్టీలు ఈ విషయం లో కూడా తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇవ్వడం గర్హించవలసిన విషయం.

తెలంగాణలోని అధికార పార్టీ బారాస( BRS ) అవిశ్వాసాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్టీల్లో ఒకటిగా ఉంది .

దాంతో ఇది కచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నదని అర్థమవుతుంది.మైనారిటీలు దళితులు( Minorities Are Dalits ) వెనుకబడిన వర్గాల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకునే ఆంధ్ర అదికార వైసిపి పార్టీ కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికే విధంగా వ్యవహరించడం మాత్రం విమర్శల పాలవుతుంది.

ఈ పార్టీలు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఆలోచిన్నాయి తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి ని పట్టించుకోవడంలేదని, సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్న ఇలాంటి విషయాలలోకూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించకపోతే అధికారానికి ఇక అర్థం లేదని రాజకీయ నిపుణులు( Political Experts ) వ్యాఖ్యానిస్తున్నారు.

"""/" / తమ స్వప్రయోజనాల కోసం పార్టీలు ఆలోచించడం తప్పు కాకపోయినప్పటికీ కనీసం ఇలాంటి మానవీయ విషయాలలోనైనా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వైసిపి ఎన్డీఏ( YCP NDA ) లో భాగం కాదని ఈ బిల్లు విషయంలో కూడా తటస్థ వైఖరి అవలంబిస్తే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మాట్లాడుతూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నట్లుగా ఇప్పటికే స్పష్టం చేసినందున అవిశ్వాసానికి వైసిపి వ్యతిరేకమని తెలిసిపోతుంది.

"""/" / ఇక తెలుగుదేశం రియాక్షన్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నందున ఈ బిల్లు విషయం లో వ్యతిరేకించినా పెద్దగా ప్రయోజనం ఉండదని పైగా తమ సభ్యుల సంఖ్య కూడా నామమాత్రమైనందున తమ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించబోదని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ రాజకీయ పక్షాలు తమ స్వప్రయోజనాల కోసం కాక సామాజిక ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని ఈ పార్టీల వ్యవహార శైలిని కొంతమంది తప్పు పడుతున్నారు.

తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!