ఎన్.ఎస్.యు.ఐ జెండా-విద్యార్థులకు అండ -డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్
TeluguStop.com
యాదాద్రి జిల్లా:50 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో విద్యార్థులకు అండగా ఎన్.ఎస్.
యు.ఐ జెండా పనిచేస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎన్.
ఐ.రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ పేర్కొన్నారు.
భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్.ఎస్.
యు.ఐ) 52 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా లోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఎన్.
ఐ జండా ఆవిష్కరణ చేసి,పట్టణంలోని ఏఆర్ గార్డెన్ (ఖాజీ మహల్లా)లో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ఎన్.ఎస్.
యు.ఐ నాయకులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బలమైన అనుబంధ సంఘంగా విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉన్న ఎన్.
ఐ 50 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో విద్యార్థుల సమస్యల కోసం,కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తుందని తెలిపారు.
ప్రస్తుత సంఘం కార్యకర్తలంతా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం,కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపూరిత,మోసపూరిత,అవాస్తవ ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అవాస్తవాలను బయటికి తీసి తిప్పికొట్టాలని సూచించారు.
రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలంతా ముందుండి నడిపించాలన్నారు.ఈ జిల్లాలో ప్రతిభావంతంగా పనిచేస్తున్న విద్యార్థి నాయకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, పీసీసీ మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్, కౌన్సిలర్స్ ఈరపాక నరసింహ,పడిగెల రేణుక ప్రదీప్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేశ్,సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్,నాయకులు బెండె శ్రీకాంత్,సుర్పంగ చందు,ఎడుమెకల మహేశ్,ఎనగండ్ల సుధాకర్,పాశం శివానంద్,చిక్కుల వెంకటేష్,ఎడ్ల శ్రీను,శివకుమార్, నాగయ్య,కాకునూరి మహేందర్,ముత్యాల మనోజ్, కొల్లూరి రాజు మరియు జిల్లా వ్యాప్తంగా ఎన్.
ఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే..?