గుడి తవ్వకాల్లో బయటపడ్డ 22 పంచ లోహ విగ్రహాలు.. ఎక్కడంటే..!

తవ్వకాల్లో విగ్రహాలు( Idols ) బయట పడటం అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం.

లేటెస్ట్ గా తమిళనాడులో ఒక పురాతన శివాలంలో తవ్వకాలు చేయగా అక్కడ ఏకంగా 22 పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి.

తమిళనాడు మైలాడుదురై జిల్లాలో శీర్గాళి లోని చగట్నాథన్ టెంపుల్ లో 30 ఏళ్ల తర్వాత భారీ కుంభాభిషేకానికి( Kumbhabhishekam ) ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాల కోసం దేవాలయంలో ఒక ప్రదేశంలో తవ్వకాలు మొదలు పెట్టారు.

అలా తవ్వుతున్న టైం లో ఒకటి రెండు కాదు ఏకంగా 22 దేవతా మూర్తులు బయటపడ్డాయి.

30 ఏళ్ల తర్వాత కుభాభిషేకం చేయాలని అనుకోగా అందులో భాగంగా మరమత్తులు చేస్తున్నారు.

ఈ క్రమంలో జరిపిన తవ్వకాల్లో విగ్రహాలు బయటపడ్డాయి.ఈ విగ్రహాలన్నీ కూడా పంచలోహ విగ్రహాలుగా గుర్తించారు.

ఈ విగ్రహాలన్నీ రెండడుగుల ఎత్తులో ఉన్నాయి.వీటితో పాటుగా రాగి రేకులు, పూజా సామాగ్రి కూడా భారీ సంఖ్యలో ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి.

విగ్రహాల గురించి పురావస్తు శాఖకు( Department Of Archaeology ) ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వారు ఇవి ఏ కాలానికి చెందినవో చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తవ్వకాల్లో ఇలాంటి విగ్రహాలు బయటపడటం కొత్తేమి కాదు.ఒకప్పుడు రాజుల పాలనలో ప్రతిష్టించబడి పూజ చేయబడిన ఎన్నో ఆలయాలు.

విగ్రహాలు ఇంకా భూమిలో ఉన్నాయని చెబుతుంటారు.ఇలా తవ్వకాలు జరిపినప్పుడు అవి బయటపడుతుంటాయి.

సుకుమార్‌ ప్రత్యేకత అదే.. అందుకే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయ్యాడు..??