ఆ కాలంలో అంత్యక్రియలలో భాగంగా ప్రజలే శవాలను తినేసేవారట?

పురాతన కాలంలో అంత్యక్రియలలో( Funeral ) భాగంగా ప్రజలే శవాలను తినేసేవారట.మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, అతని జీవనశైలి గురించి నేటికి మనవాళ్లు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో పురావస్తు శాస్త్రవేత్తలు( Archaeologists ) చాలా భయంకర విషయాలు వెల్లడిస్తున్నారు.

అవును, ఆ కాలంలో వారిలో ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు.

నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్‌ విషయాలు తాజాగా వెల్లడించారు.

"""/" / దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్‌లుగా( Magdalenian ) పిలిచేవారని వినికిడి.

వారు నరమాంస భక్షణ( Cannibals ) చేసేవారని తేలింది.అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని సమాచారం.

ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని పండగ చేసుకొని మరీ తినేసేవారని చెప్పుకొచ్చారు.

అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా అని, దానికి సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు.

"""/" / ఇకపోతే.మాగ్డలీనియన్‌ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని చెప్పుకొచ్చారు మన శాస్త్రవేత్తలు.

అలా ఐరోపాలో( Europe ) పురాతన శిలయుగంలో 2 విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు.

కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు కనుగొన్నారు.ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని అంటున్నారు.

వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించడం కొసమెరుపు.

ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?