వైరల్ వీడియో: రాజుల కాలంలో రాణుల అండర్‌వేర్‌పై ఆసక్తికర చర్చ
TeluguStop.com
ప్రపంచంలో చాలా దేశాల్లో రాజ్య పాలన అంతరించిపోయినా.రాజులు, రాణుల జీవనశైలి పై ఆసక్తి మాత్రం తగ్గలేదు.
చరిత్ర( History ) ఆధారంగా రూపొందించిన సినిమాలు, సీరియల్స్ ద్వారా కొంతవరకు వారి జీవిత విధానాన్ని ఊహించగలిగినప్పటికీ, కొన్ని విషయాలు వివాదాస్పదంగా మారే అవకాశం ఉండటంతో బయటికి రావు.
అయితే, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.
ఇందులో, రాజులు తమ రాణులపై నమ్మకం లేకపోతే ప్రత్యేకమైన అండర్‌వేర్‌ను తాళం( Lockable Underwear ) వేసి వెళ్లేవారని చెబుతున్నారు.
ఇది నిజమేనా? లేదా కేవలం ఊహాగానమా? అన్న విషయాన్ని చూద్దాం. """/" /
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి 500 ఏళ్ల పురాతనమైన మహిళల అండర్‌వేర్‌ను చూపిస్తూ, రాజులు తమ రాణుల( Queens ) నిష్ఠపై సందేహం ఉంటే, దీనిని తాళం వేసి ఉంచేవారని చెబుతున్నాడు.
ఈ అండర్‌వేర్ డిజైన్ విభిన్నంగా ఉండటంతో, అది నిజంగా అలాంటి ప్రయోజనాల కోసమేనా? లేక వేరే ఉద్దేశ్యంతోనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది రాజుల నిరంకుశతకు నిదర్శనమా? లేదా చారిత్రక నిజమా? అనే దానిపై స్పష్టత లేదు.
ఈ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది చూడగా.లక్షల మంది లైక్స్, వేల మంది కామెంట్స్ చేశారు.
"""/" /
ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ బిన్నస్వరాలుగా స్పందిస్తున్నారు.
కొంతమంది ఈ వీడియో పూర్తి అబద్దం అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు ఏమో ఇలాంటి వాటి వల్ల రాణులు బాత్రూం కూడా వెళ్లకుండా ఉండేవారా అంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటివి కేవలం యుద్ధ సమయంలో రాణులు ఉపయోగించేందుకు తయారు చేయబడింది అని పేర్కొన్నారు.
మరికొందరేమో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే, ఈ వైరల్ వీడియోలో చెప్పిన విధంగా అది పూర్తి నిజం అని ధ్రువీకరించలేము.
చరిత్రలో నిజంగా ఇలాంటి అండర్వేర్ లో ఉంటాయా లేక.కేవలం కల్పితం అనే విషయంలో స్పష్టత తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.