విష్ణు ప్రియ.యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది ఈ అమ్మాయి.
ఇప్పటికే పలు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.1987 ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో జన్మించింది.
ప్రసుతం 34 ఏండ్లు.ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా.
తల్లి హౌస్ వైఫ్.హైదరాబాద్ ఎథిమ్స్ కాలేజీ నుంచి బీబీఏ పూర్తి చేసింది విష్ణు ప్రియ.
తండ్రి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు.
విష్ణుప్రియ కుటుంబం సంప్రదాయ కుటుంబం.ఆమె తాత తనకు భగవద్గీత సహా పలు పురాణాల శ్లోకాలు నేర్పించే వారు.
దీంతో కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళ తన ఏరియాలోని పిల్లలకు ఆమె శ్లోకాలు నేర్పించేది.
దానికి కొంత రుసుము వసూలు చేసి పాకెట్ మనీ సంపాదించుకునేది.అంతేకాదు.
చిన్నప్పటి నుంచే తనకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది.దాంతో 2005లో మయూఖం అనే మలయాళీ మూవీ కెరీర్ స్టార్ట్ చేసింది.
2006లో తమిళ మూవీ చేసిన ఈమె 2007లో తెలుగులో యమదొంగ సినిమా చేసింది.
2008లో కన్నడ మూవీ గోలిలో నటించింది. """/"/
అటు పలు సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లో నటించింది విష్ణుప్రియ.
2017లో పోవే పోరా టీవీ షో యాంకర్ గా పరిచయం అయ్యింది.సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ షోకి యాంకర్ గా చేసింది.
ఆమె చలాకీ తనంతో జనాలను బాగా ఆకట్టుకుంది.ఇప్పుడు తను ఒక్కో షోకు 50 నుంచి 70 వేల రూపాయలు తీసుకుంటుంది.
ఇక విష్ణు ప్రియకు ప్రభాస్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.అనుష్క, సమంత తన ఫేవరెట్ హీరోయిన్లు.
ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తొంది.మణికొండ హాల్ మార్క్ అపార్ట్ మెంట్ లో కోటిన్నర విలువచేసే ఫ్లాట్ తో పాటు రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి.