విష్ణుప్రియ ఫేస్ బుక్ హ్యాక్.. అలాంటి ఫోటోలు ప్రత్యక్షం అవ్వడంతో అంత షాక్?
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అందరిలో ఉంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సోషల్ మీడియా ఖాతాలు బాగా అలవాటు పడ్డాయి.
ప్రతి ఒక్క విషయాన్ని అందులో షేర్ చేసుకొని తెగ సందడి చేస్తున్నారు.నిజానికి సోషల్ మీడియా ఎంతగా కాలక్షేపాన్ని అందిస్తుందో కొన్ని కొన్ని సార్లు అవి హ్యాక్ అయితే మాత్రం తీవ్రమైన నష్టాన్ని అందిస్తుంది.
నిజానికి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం కొత్త ఏమీ కాదు.ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి.
దీని వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.వెంటనే ఈ విషయాలను కూడా తమ ఫాలోవర్స్ కు అందజేస్తూ ఉంటారు.
అలా తాజాగా బుల్లితెర ఆర్టిస్ట్ విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాక్ కావటంతో ప్రస్తుతం ఆ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన విష్ణుప్రియ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదనే చెప్పాలి.
తన యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది విష్ణుప్రియ.తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.
ఇక ఈ షోలో తన మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.
ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరట్లేవు.ప్రస్తుతం అవకాశాల కోసం బాగా కష్టపడుతుంది విష్ణుప్రియ.
"""/"/
విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.
కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు ఎందుకో వెనుకడుగు లోనే ఉంది.
తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.
ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.
పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
"""/"/
ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.
నిజానికి విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేకపోతుంది.
కానీ ఇటీవల ఓ సినిమాలో అవకాశం అందుకుంది.అంతేకాకుండా ఒక ప్రైవేట్ సాంగ్ లో కూడా చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.
గత రాత్రి తన ఫేస్ బుక్ నుంచి నగ్నంగా ఉన్న ఫోటోలు రావటంతో తన ఫేస్ బుక్ హ్యాక్ అయినట్లు తను గుర్తించింది.
ఇక ఈ విషయాన్ని తను ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ కి తెలియజేసింది.
ఈ విషయాన్ని అందరికీ తెలియజేయమని తెలిపింది.