కూతుర్లని కార్మికులుగా మార్చేసిన ప్రముఖ యాంకర్... ఫోటోలు వైరల్!

మే ఒకటవ తేదీ కార్మికుల దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభాను కార్మికుల దినోత్సవం సందర్భంగా తన ఇద్దరు చిన్నారులను కార్మికులుగా మార్చేశారు.

ఈ క్రమంలోనే తన కూతుర్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఒకానొక సమయంలో బుల్లితెరపై, వెండితెర పై ఎన్నో సినిమాలు,బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఉదయభానుకు ఇద్దరు కవల పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే.

ఆ ఇద్దరికీ భూమి ఆరాధ్య, యువి నక్షత్ర అని పేర్లు పెట్టారు.పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచంగా అయిపోయిన ఉదయభాను ఎలాంటి బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెరపై కూడా సందడి చేయలేదు.

"""/" / ఇలా తన పిల్లలే తన ప్రపంచమని బతుకుతున్న ఉదయభాను ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే ఆ వేషధారణలో తన కూతుళ్ళను ముస్తాబు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే మే ఒకటో తేదీ కార్మికుల దినోత్సవం కావడంతో తన ఇద్దరు చిన్నారులను కార్మికులుగా మార్చారు.

పొలంలో గడ్డిమోపులు మోస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను ఉదయభాను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?