ఎట్టకేలకు సుమక్క కూడా ఆ పని మొదలెట్టేసిందిగా.. పాపం ఈ వయసులో?

బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ఇకపై వెండితెరపై కూడా తన సత్తా ఏంటో నిరూపించడానికి సిద్ధమయింది.

ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉండగా తాజాగా సుమ జిమ్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎప్పుడు జీరో సైజ్ లో కనిపించే సుమక్క ఎట్టకేలకు జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

అయినా ఎప్పుడూ లేనిది సుమ ఇలా కష్టపడటంతో ఆమె కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సుమ తన తల్లి ఇప్పటికి కూడా వర్కౌట్ చేస్తోందంటూ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సుమా వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"""/"/ ఈ వీడియోలో సుమ డంబెల్స్ ఎత్తుతూ ఎంతో కష్టపడుతోంది.పెద్ద డంబుల్స్ రెండుసార్లు పైకి కిందికి ఎత్తడంతో తన పని అయిపోయిందని, కాసేపటికే తన వల్ల కాదనివాటిని కింద పెట్టేసిన తన ట్రైలర్ మాత్రం ఆపండి అనడం లేదంటూ ఈ వీడియోలో సుమ తన జిమ్ ట్రైనర్ గురించి చెప్పుకొచ్చారు.

ఏదిఏమైనా సుమ ఇలా తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు చివరికి సుమక్క కూడా తన ఫిట్ నెస్ పై దృష్టి సారించింది అంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఇక సుమ నటించిన జయమ్మ పంచాయతీ మోషన్ పోస్టర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా ద్వారా వెండితెరపై సుమ ఎలాంటి మార్క్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

తమ్ముడా.. ఎదురెళ్లి దూకేయ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!