మేకప్ లేకుండా సుమ ఫోటో.. నెట్టింట వైరల్!
TeluguStop.com
మన స్టార్ హీరోయిన్లలో, యాంకర్లలో చాలామంది మేకప్ లేకుండా ఫోటో దిగాలంటే గజగజా వణుకుతారు.
కొందరు హీరోయిన్లు, యాంకర్లనైతే మేకప్ లేకుండా అస్సలు గుర్తుపట్టలేం.గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్ల మేకప్ లేని ఫోటోలు విడుదలైన సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లేంటి.
? ఇలా ఉన్నారు అని కామెంట్లు వినిపించాయి.కొందరు హీరోయిన్ల మేకప్ లేని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి.
అయితే స్టార్ యాంకర్ సుమ మాత్రం ఎలాంటి మేకప్ లేకుండా తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన భర్తతో సుమ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మేకప్ లేకపోయినా సుమ అందంగానే ఉన్నారని.కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.
మేకప్ లేకుండా ఫోటో పోస్ట్ చేయాలంటే గట్స్ ఉండాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
సుమ "ప్రకృతి మరియు జీవితం యొక్క అందం ఒకే ఫోటోలో ఉంది" అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ ఫోటోకు 98,000 లైకులు రాగా 1,500 కామెంట్లు వచ్చాయి.నిజ జీవితంలో చాలా అన్యోన్యంగా ఉండే రాజీవ్ కనకాల, సుమ విడిపోయారని కొన్ని నెలల క్రితం గాసిప్స్ వినిపించాయి.
ఇద్దరూ వేర్వేరు ఇళ్లల్లో ఉన్నారని.పరస్పర అంగీకారంతో విడిపోయారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అప్పట్లో సుమ, రాజీవ్ కనకాల ఈ వార్తలపై స్పందించకపోవడంతో ప్రజలు కూడా ఈ వార్త నిజమేనేమో అని భావించారు.
అయితే కొన్ని వారాల క్రితం వీరిద్దరూ కలిసి క్యాష్ అనే షోలో సందడి చేయడంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
ఆ తరువాత సుమ సోషల్ మీడియాలో భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం సుమ క్యాష్ ప్రోగ్రామ్ తో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు చేస్తున్నారు.
మామిడిపండ్లు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. జాగ్రత్త!