మళ్లీ పప్పులో కాలేసిన సుమ… కంగారులో మర్చిపోయిందా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ మాట తడబడకుండా ఎంతో చాకచక్యంగా తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి వారిలో టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ >( Suma ) ఒకరు.
ఈమె తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.
అయితే ఈ మధ్యకాలంలో సుమ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సమయంలోను అలాగే ప్రీ రిలీజ్ వేడుకలలో కూడా కొన్ని కొన్నిసార్లు తడబడుతూ మాట జారుతున్నారు.
ఇలాంటి సమయంలోనే సుమ పట్ల భారీ స్థాయిలోనే H3 Class=subheader-styleట్రోల్స్ జ/h3pరుగుతున్నాయి అయితే తాజాగా కూడా సుమ మరోసారి మాట జారారని తెలుస్తుంది.
"""/" /
తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor) రష్మిక(Rashmika) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి యానిమల్ ( Animal )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే మహేష్ బాబు (Mahesh Babu) కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
"""/" /
ఇక ఈ వేదికపై రష్మిక మందన్న స్పీచ్ తర్వాత తనతో ఒక పాట పాడించే ప్రయత్నం చేసింది సుమ.
ఈ క్రమంలోనే మహేష్ బాబు రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరు( Sarileru Nekevvaru ) సినిమాలోని హి ఈస్ సో క్యూట్ అనే పాటను పాడించాలనే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే సినిమా పేరు సరిలేరు నీకెవ్వరు అని పలకడం పోయి సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) అంటూ మాట్లాడారు.
దీంతో పలువురు నెటిజెన్స్ సుమ మర్చిపోయాలా మాట్లాడారా లేక సినిమా పేరు గుర్తు లేకపోవడంతోనే అలా మాట్లాడారా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక సుమ సర్కారు వారి పాట అని చెప్పగా రష్మిక కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిపోవడంతో రష్మిక కి కూడా ఈ సినిమా పేరు గుర్తులేదు అంటూ చేస్తున్నారు.
ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!