ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిన యాంకర్ సుమ.! స్టార్ మహిళా కార్యక్రం ఆపేస్తున్నారు.! ఎందుకో తెలుసా.?
TeluguStop.com
మాటే మత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి.
నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ.ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ.
ఏ టివి పెట్టినా.ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు.
“రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు.
“సుమ” గారి షోస్ అన్ని చాల ప్లైన్ గా, వల్గారిటీ లేకుండ అంటాయి.
అందుకే ఆమె షోస్ కి ఫాన్స్ ఎక్కువ.!
సుమారు 12 సంవత్సరాలుగా విజయవంతంగా దూసుకుపోతున్న స్టార్ మహిళ’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు కూడా దక్కింది.
కానీ ఆ షో ని సడన్ గా ఆపేస్తున్నారని సుమ ఫేస్బుక్ లో ఓ వీడియో పెట్టింది.
అందులో ఏం చెప్పింది అంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
‘మీ అందరికీ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను.
మీరు సుమ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ‘స్టార్ మహిళ’ కార్యక్రమం.ఏకధాటిగా గత 12 ఏళ్లుగా ఈ షో విజయవంతంగా దూసుకెళుతోంది.
ఈ షోను ఆదరించినవారందరికీ శతకోటి వందనాలు.కానీ, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు.
అదే విధంగా ‘స్టార్ మహిళ’ ప్రయాణం కూడా ముగియనుంది.మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘స్టార్ మహిళ’కు చిన్న ముగింపు పలుకుతున్నాం.
త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నాం.మీరు నాకు, స్టార్ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే మీరు ఒక చిన్న పని చేయండి.
మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకోండి.
వాటిలో బెస్ట్ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్‌లో ప్రసారం చేస్తాం.చిన్నా.
పెద్దా అన్న తేడాలేకుండా ప్రతిఒక్కరూ ‘స్టార్ మహిళ’ కార్యక్రమాన్ని ఆదరించారు.వారందరి ప్రేమను, స్టార్ మహిళ ప్రోగ్రామ్‌ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’’ అని సుమ ఈ వీడియోలో తెలిపారు.
వీడియో వైరల్.. భార్యతో కలిసి రెచ్చిపోయిన ట్రంప్