లక్ష్మణ రేఖ అయిన దాటుతారు కానీ... ఆ రేఖను దాటరు...చిరు పై సుమ కామెంట్స్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే వరుసన సినిమా ప్రమోషన్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలకు, ప్రెస్ మీట్ లను నిర్వహించి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన చిరంజీవి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమవుతున్న సుమ అడ్డా అనే కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.ఇక రెండవ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/"/
అయితే ఈ ప్రోమోలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ సుమ చిరంజీవికి ఘన స్వాగతం పలికారు.అయితే ఈ ప్రోమోలో భాగంగా చిరు చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇక సుమ చిరంజీవి గారిని ప్రశ్నిస్తూ ఈ రేఖలలో మీకు ఏ రేఖ అంటే భయము అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చిరంజీవి సురేఖ అంటూ సమాధానం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
"""/"/
ఆయన లక్ష్మణ రేఖ ఆయన దాటుతారు కానీ సురేఖను మాత్రం దాటరు అంటూ సుమ కూడా చిరంజీవితో కలిసి సందడి చేశారు.
ఇక సుమకు సురేఖగా పేరు మార్చిన చిరంజీవి చూడాలని ఉంది సినిమాలో ఒక సీన్ ని సుమతో కలిసి రిక్రియేట్ చేశారు.
ఇక ఈ ప్రోమోలో భాగంగా డోంట్ స్టాప్ లాఫింగ్.సుమ అడ్డా లోడింగ్ అంటూ చిరు చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు సినిమా డైరెక్టర్ బాబి అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా హాజరై సందడి చేశారు.
పాన్ ఇండియాలో ఈ ఇద్దరు హీరోలు బాగా వెనకబడిపోయారా..?