ఈ సీరియల్ హీరోయిన్ గుర్తుందా.. యాంకర్ సుమకు ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా.. ?
TeluguStop.com

యాంకర్ సుమ.తెలుగు జనాలు అందరికీ తెలిసిన పేరు.


ఏమాత్రం టీవీ చూసే వారికి అయినా.ఈమె కచ్చితంగా తెలిసే ఉంటుంది.


తెలుగు బుల్లి తెరను ఓ రేంజిలో ఏలుతున్న యాంకర్ సుమ.వయసు పెరుగుతున్నా తనలోని చలాకీతనం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది ఈ బుల్లితెర బ్యూటీ.
గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది యాంకర్లు వచ్చారు.పోయారు.
కానీ సుమా మాత్రం పాతుకుపోయింది.ఈమెకున్న క్రేజ్ రోజు రోజుకు మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
టీవీ చూసే ప్రతి ఇంట్లో సొంతింటి మనిషిలా మారిపోయింది యాంకర్ సుమ.యాంకర్ సుమ బాగా ఫేమస్ కావడంతో ఆమె బంధువులు సైతం బుల్లితెరపైకి రంగ ప్రవేశం చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు యాక్టింగ్ రంగంలోకి అడుగు పెట్టారు.వారిలో ఒకరే యతస్వీ కనకాల.
ఆమె ఒరిజినల్ నేమ్ నవ్య స్వామి కనకాల.ఈమె సుమకు దగ్గరి బంధువు.
సుమ భర్త రాజీవ్ కు చెల్లి వరుస అవుతుంది.సుమకు మరుదలు అవుతుంది.
ఈమె ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో నెగెటివ్ రోల్స్ చేసింది.బాగా పాపులర్ అయ్యింది కూడా.
"""/"/
కార్తీక దీపం సీరియల్ లో మోహిత స్నేహితురాలు శ్రీలత క్యారెక్టర్ చేసి అదరగొట్టింది.
జెమినీ టీవీలో టెలీకాస్ట్ అవుతున్న తాళి సీరియల్లో కూడా ఆమె నెగిటివ్ రోల్ చేసింది.
జెమినీతో పాటు ఈటీవీ, జీటీవీలో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లో ఆమె ఎన్నో పాత్రలలు చేసింది.
ప్రస్తుతం టాప్ టీవీ నటిగా కొనసాగుతోంది.సుమ బంధువు అయినా.
సొంతంగానే తన టాలెంట్ నిరూపించుకునేందుకు కష్టపడుతోంది ఈ బుల్లితెర బ్యూటీ.కష్టపడటమే కాదు సక్సెస్ అయ్యింది అని కూడా చెప్పుకోవచ్చు.
ఆమెకు వచ్చే పలు అవకాశాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.