రియల్ ఎస్టేట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన సుమ.. ఇప్పుడు స్పందించినా లాభం ఏమంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ( Anchor Suma ) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు.
ఇండస్ట్రీలో అందరి మెప్పు పొందిన యాంకర్లలో సుమ ఒకరని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఒక రియల్ ఎస్టేట్( Real Estate ) సంస్థకు సంబంధించిన మోసం విషయంలో సుమ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్డ్ తిప్పేసిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
సుమ చేసిన యాడ్ చూసే తామ్ ఫ్లాట్స్ కొన్నామని బాధితులు చెబుతున్నారు.కొందరు బాధితులు సుమకు లీగల్ నోటీసులు సైతం పంపారట.
అయితే ఆ కంపెనీ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుమ చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి గతంలో నేను చేసిన యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తోందని సుమ చెప్పుకొచ్చారు.
2016 నుంచి 2018 వరకు మాత్రమే ప్రసారం చేసేలా సదరు యాడ్ కు సంబంధించిన ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు.
"""/" /
అయితే మా అనుమతి లేకుండా ఆ యాడ్ ను ఇప్పటికీ ప్రసారం చేస్తున్నారని సుమ పేర్కొన్నారు.
కొందరు బాధితుల నుంచి ఇందుకు సంబంధించిన లీగల్ నోటీసులు( Legal Notices ) సైతం వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.
వాళ్లకు నేను ఇప్పటికే సమాధానం ఇచ్చానని సుమ తెలిపారు.ఆ సంస్థకు సైతం నోటీసులు పంపానని సుమ పేర్కొన్నారు.
అధికారిక ఛానెళ్లలో వచ్చే యాడ్స్, ప్రమోషన్స్ లో కచ్చితమైన సమాచారం ఉంటుందని గ్రహించాలని ఆమె తెలిపారు.
"""/" /
వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ను మాత్రమే షేర్ చేయాలని సుమ పేర్కొన్నారు.
అయితే సుమ ఈ వివాదం నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.సెలబ్రిటీలు తాము నటించే యాడ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటనతో ప్రూవ్ అయింది.
సుమ ప్రస్తుతం పరిమితంగా షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
అలసిపోయారా.. ఇక్కడ వెయిట్రెస్ ఒడిలో హాయిగా పడుకోవచ్చు.. 20 నిమిషాలకు రేటెంతంటే..!