Anchor Suma: ఆ ఒక్క షో కోసం యాంకర్ సుమ ఎన్ని వేల చీరలు కట్టుకున్నదో తెలుసా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల (Suma Kanakala) ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దశాబ్దాల కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలుతోంది.

బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ప్రతి ఒక్క సినిమా ఈవెంట్ కి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు సుమ వారంలో ఏడు రోజులపాటు ఎంతో బిజీగా గడుపుతున్నారు అనే సంగతి తెలిసిందే.

ఇక ఈమె యాంకర్ గా ఎక్కువ ఎపిసోడ్స్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో స్టార్ మహిళ (Star Mahial)ఒకటి ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం కొన్ని వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం కాకుండా సుమ అడ్డ( Suma Adda ) అనే పేరిట మరో కార్యక్రమం ప్రసారం అవుతుంది.

ఇకపోతే సుమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ మహిళ కార్యక్రమం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

సుమ ఒక్కో షో కి ఒక్కో రకమైన డ్రెస్ ధరిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.

"""/" / ఇక స్టార్ మహిళా కార్యక్రమానికి ఈమె సారీస్( Sarees ) మాత్రమే వేసుకునే వారట అయితే ఈ ఒక్క షో కి సుమా ఏకంగా 5000 చీరలు కట్టాను అంటూ ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

అదేవిధంగా స్వరాభిషేకం( Swarabhishekam ) కోసం మరో 1500 చీరలు కట్టి ఉంటానని మొత్తం 6500 చీరలు ఈ రెండు షోలకు కట్టుకున్నాను అంటూ ఈ విషయాలను వెల్లడించారు.

అదృష్టం ఏంటంటే ఆ చీరలు కేవలం నా ఒంటి పై వరకు మాత్రమే వస్తాయి కానీ నా ఇంటికి రావు.

అందులో నేను చాలా అదృష్టవంతురాలని అంటూ ఈమె సరదాగా కామెంట్స్ చేశారు.అదేవిధంగా తన కొడుకు సినిమా గురించి కూడా సుమా ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / అందరూ మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ మా వాడిని ఫస్ట్ డే షూటింగ్ ఎలా జరిగింది నాన్న అని అనడంతో చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అంటూ కామెంట్స్ చేశారని తెలిపారు.

ఇక మీరు మీ కొడుకుతో ఏమైనా నటించే అవకాశాలు ఉన్నాయా అంటూ యాంకర్ అడగడంతో మేబీ త్వరలోనే అది కూడా జరగబోతుంది అంటూ సుమ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

"""/" / సుమ మాటలను బట్టి చూస్తుంటే ఈమె రోషన్( Roshan ) మరో సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది.

ఇక రోషన్ త్వరలోనే బబుల్ గమ్( Bubble Gum Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ప్రముఖ సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.