సుమ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి తనే కారణమా… మొదటిసారి తనని పరిచయం చేసిన సుమ!
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ఒకరు.
ఈమె వారంలో ఏడు రోజుల పాటు వరుస సినిమా ఈవెంట్లతోనూ బుల్లితెర కార్యక్రమాలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
గత రెండు మూడు దశాబ్దాలుగా సుమ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో చలాకీగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ వీడియోల ద్వారా ఈమె తన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే తన టీమ్ మెంబర్స్ ను కూడా చూపిస్తూ సందడి చేస్తుంటారు.
ఇక ఇది వరకే సుమ ఎన్నోసార్లు తన అమ్మను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.
ఎనిమిది పదుల వయసులో కూడా సుమ తల్లి ఎంతో స్ట్రాంగ్ గా, చాలా యాక్టివ్గా ఉన్నారు.
"""/" /
ఇకపోతే తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా తన తాతయ్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
అలాగే తన తాతయ్య గురించి కూడా ఈమె చెప్పుకొచ్చారు.తన తాతయ్య పేరు శ్రీ.
పీ.బీ మీనన్ అని పరిచయం చేశారు.
ఆయన తన అమ్మకు స్వయంగా మామయ్య అవుతారని తెలిపారు.ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు ఇప్పటికి తన తాతయ్య పాలక్కడ్ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారని సుమ తెలియజేశారు.
"""/" /
ఇక సౌత్ కేరళ మొత్తంలో అత్యంత వృద్ధ న్యాయవాది తన తాతయ్యే అంటూ సుమా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు అర్థమైందా నేను ఇలా చలాకి గా ఉండడానికి కారణం ఏంటో నా జీన్స్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటా అంటూ మొదటిసారి తన తాతయ్యతో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.