తొలిసారి తన చెల్లిని పరిచయం చేసిన సుమ.. ఆప్యాయంగా పెరిగామంటూ?
TeluguStop.com
బుల్లితెర యాంకర్ సుమ ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో షోలతో బిజీగా ఉన్నారు.
గతంతో పోలిస్తే సుమ హవా తగ్గినప్పటికీ నంబర్ 1 యాంకర్ గా సుమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
సుమ హోస్ట్ చేస్తే ఆ షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ లు రావడంతో పాటు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కలిగి ఉన్న సుమ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
సుమ స్పాంటేనియస్ గా వేసే పంచ్ లు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగడానికి కారణమవుతున్నాయి.
కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్, సినిమాలు చేసిన సుమ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు.
అవాక్కయ్యారా షో ఆమె కెరీర్ కు ప్లస్ అయింది.యాంకర్లలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా కూడా యాంకర్ సుమకు పేరుంది.
"""/"/
అయితే తాజాగా ఓనమ్ పండుగ సందర్భంగా సుమ తన చెల్లిని నెటిజన్లకు పరిచయం చేశారు.
సుమ పరిచయం చేసిన మహిళ మామయ్య కూతురు కాగా సుమ ఆమె సొంత చెల్లి కంటే ఎక్కువని చెప్పడం గమనార్హం.
మొదట చెల్లి అని చెప్పి నమ్మించిన సుమ ఆ తర్వాత ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు.
తను, తన మామయ్య కూతురు ఎంతో ఆప్యాయంగా పెరిగామని సుమ కనకాల కామెంట్లు చేశారు.
"""/"/
ఓనమ్ పండుగ సందర్భంగా సుమ కనకాల తన లుక్ ను సైతం పూర్తిగా మార్చుకోవడం గమనార్హం.
మరోవైపు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ సుమ యూట్యూబ్ ఛానల్ ను కొన్ని నెలల క్రితం లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
తన సోదరితో కలిసి ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేసిన సుమ చెల్లితో కలిసి భోజనం చేశారు.
బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!