పనిమనిషితో చిల్ అవుతున్న సుమ.. ఫోటో వైరల్!

టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

సుమ ప్రధానపాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ అనే సినిమా ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సాధారణంగా సుమకు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కొత్తేమీ కాదు ఇప్పటి వరకు ఇతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సుమ ప్రస్తుతం తన సినిమాకు తానే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఇకపై జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ కాస్త రిలాక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఇక సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంట్లో ఎన్నో ఫన్నీ వీడియోలను చూస్తూ తన పని మనిషి గురించి మనకు ఎన్నో సార్లు వెల్లడించారు.

అయితే ప్రస్తుతం సుమ తన పనిమనిషితో కలిసి కాస్త చిల్ అయినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన పనిమనిషితో మసాజ్ చేయించుకుంటున్న ఫోటోని సుమ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

తల మొత్తం సినిమా ప్రమోషన్ తో నిండిపోయింది అలా మసాజ్ చేయడంతో చాలా రిలాక్స్ అయ్యానంటూ సుమ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు.

ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?