పండుగ ఆనందాల‌ను పంచుతున్న యాంక‌ర్ సుమ‌

పండుగ అంటే ఆనందం.పండుగ ఒక సంబ‌రం.

ఆ ఆనందాల‌ను, సంబ‌రాల‌ను ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారుల‌కు అందింస్తుంది.పండుగ అంటే మ‌నం ఆనందంగా జ‌రుపుకునేది మాత్ర‌మేకాదు.

మ‌న ఆనందాల‌ను అవ‌స‌ర‌మైన వారికి పంచేది కూడా .ఈ మాట‌ను అక్ష‌రాల‌లో కాదు ఆచ‌ర‌ణ‌లో చూపుతుంది సుమ‌.

సినిమా మ‌రియు టెలివిజ‌న్ రంగాల‌లో కోవిడ్ కార‌ణంగా స‌రైన ప‌నిలేక, లేదా కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్న ప‌ది మంది న‌టీ మ‌ణుల‌ను ఎంపిక చేసి వారికి నిత్యావ‌స‌రాల‌ను, మెడిక‌ల్ ఇన్సూరెన్స్ ల‌ను అందించేందుకు దాత‌ల ఏర్పాటు చేసింది.

ద‌స‌రా ప‌ర్వ దినాన శ‌క్తి స్వ‌రూపిణి పేరుతో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు సుమ అండ్ టీం.

పెస్టివ‌ల్స్ ఫ‌ర్ జాయ్ పేరుతో సుమ నిర్వ‌హించే ఈ టాక్ షో ద్వారా ప్ర‌తి పండుగ‌కు సినిమా, టెలివిజ‌న్ రంగాల‌లో ఆర్ధిక బాధ‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారిని గుర్తించి వారి కి దాత‌ల‌ను ఏర్పాటు చేసేకార్య‌క్ర‌మం కోన‌సాగ‌బోతుంది.

ఈ ద‌స‌రా సంద‌ర్భంగా సుమ ప్ర‌య‌త్నానికి అండ‌గా నిలిచి కొంత‌మంది కుటుంబాల‌లో పండుగ వెలుగులు నింపిన దాత‌లు ఈశ్వ‌ర్ దొమ్మ‌రాజు , ప్ర‌జ్వల పౌండేష‌న్ సునీత కృష్ణ‌న్, శిల్ప పోపూరి, శ్ర‌వ‌ణ్ కుమార్ (వి షైన్ పౌండేష‌న్) న్యూయార్క్ లో స్థిర ప‌డిన ఈశ్వ‌ర్ దొమ్మ‌రాజు ప‌ది మంది న‌టీమ‌ణుల‌కు ఒక యేడాదిపాటు నిత్యావ‌స‌రాల‌ను, ప్ర‌తి ఒక్క‌రికీ రెండు ల‌క్ష‌ల మెడిక‌ల్ ఇన్సూరెన్స్ అందించారు.

ప్ర‌జ్వ‌ల పౌండేష‌న్ ప‌దిమంది మ‌హిళ‌ల‌కు ఉపాధికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ను అందించేందుకు సిద్దం అయ్యారు.

"""/"/ ఈ సంద‌ర్భంగా సుమ మాట్లాడుతూ.పండుగ అంటే మ‌నం ఆనందంగా ఉండేది మాత్ర‌మే కాదు.

మ‌న చుట్టూ ఉన్న వారిలో కొంత‌మందికైనా ఆ ఆనందాల‌ను పంచ‌గ‌లిగితే అది పండుగ‌కు నిజ‌మైన సార్ధ‌క‌త అని సుమ అన్నారు.

ఇప్ప‌టి నుండి వ‌చ్చే ప్ర‌తి పండుగ‌కు కొంత‌మందిని ఎంపిక చేసి దాత‌ల స‌హాయంతో వారికి చేదోడుగా నిల‌బ‌డ‌తాము.

ఫెస్టివ‌ల్స్ ఫ‌ర్ జాయ్ పేరుతో నిర్వ‌హించే ఈ టాక్ షో ద్వారా తాము చేసే ఈ స‌హాయ కార్యక్ర‌మాలు భవిష్య‌త్ లో మ‌రింత పెరిగేందుకు కృషి చేస్తాము.

త‌మ అభ్య‌ర్ద‌న మ‌న్నించి స‌హాయం అందించిన దాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్19, శుక్రవారం2024