ఆ వీడియో క్లిప్ షేర్ చేస్తూ అతనికి ఐ లవ్యూ చెప్పిన యాంకర్ శ్రీముఖి.. నెట్టింట్లో వైరల్!
TeluguStop.com
బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న గ్లామర్ బ్యూటీ శ్రీముఖి.
ఈమె పరిచయం గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.
ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.
శ్రీముఖి ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి బాగా ఆకట్టుకుంది.
అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి తన యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.
ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఇక ఈమె బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది. """/"/
ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.
అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.
తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.
ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది. """/"/
అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం పలు ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా స్టోరీ లో ఒక వీడియో షేర్ చేసుకుంది.
ఇక అందులో ఒకతనికి ఐ లవ్ యూ అని కూడా చెప్పేసింది.ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అంటే.
ఒక ఈవెంట్ లో శ్రీముఖి సాకేత్ అనే ఓ వ్యక్తికి ఫ్రూట్ తినిపిస్తున్నట్లు కనిపించింది.
ఇక దీంతో అతడు దానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకోగా.ఆ వీడియోను రీ పోస్ట్ చేసింది శ్రీముఖి.
అంతే కాకుండా ఆ వీడియోకు బాగా నవ్వుకొని ఐ లవ్ యు రా అంటూ లవ్ సింబల్ తో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.
గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..?