మేమిద్దరం కలిసినప్పుడు అంటూ శ్రీముఖి వీడియో.. వైరల్!
TeluguStop.com
బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి.ఈమె పరిచయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.
బుల్లితెర లో ఎన్నో షోల్లో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి.
తన అందంతో ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
కానీ బుల్లితెరపై అందుకున్న సక్సెస్ మాత్రం వెండితెరపై అందుకోలేదు.ఇక శ్రీముఖికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
యాంకర్ రవితో పటాస్ షోలో యాంకరింగ్ చేసినా శ్రీముఖికి ఇక్కడి నుండే అసలైన క్రేజ్ అందుకుంది.
అంతేకాకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని చివరివరకు గేమ్ లో ఆడి రన్నరప్ గా నిలిచింది.
ఇక ఈ షో తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పవచ్చు.ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఫోటోలను, డాన్స్ వీడియోలను, ఫన్నీ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది శ్రీముఖి.
అంతేకాకుండా అభిమానులతో తెగ ముచ్చట్లు పెడుతుంది.ఇక పొట్టి పొట్టి నిక్కర్ లతో డాన్స్ స్టెప్పులతో బాగా రెచ్చిపోతుంది.
ఇటీవల శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
ఈమధ్య ఏలియన్ గా కనిపిస్తూ క్యూట్ క్యూట్ మాటలతో ఫాలోవర్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
"""/"/
తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.
అందులో బిగ్ బాస్ కమెడియన్ అవినాష్ తో ఏలియన్ ఫిల్టర్ చేసింది.అందులో ఏదో షో విరామ సమయంలో ఉన్నట్లు కనిపించగా.
అందులో ఓ తమిళ పాటకి అవినాష్ లిరిక్స్ పాడగా శ్రీముఖి సిగ్గుపడుతూ మెలికలు తిరిగింది.
ఇక అందులో అవినాష్ పెదరాయుడు గెటప్ లో ఉన్నాడు.ఇక శ్రీముఖి ఏలియన్ రాయుడు, తను కలిసినప్పుడు.
తమ లిప్ సింక్ చాలా అద్భుతంగా ఉందంటూ వీడియోకి క్యాప్షన్ పెట్టింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
నిత్యం ఈ హెర్బల్ టీను తీసుకుంటే నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కు బై బై చెప్పవచ్చు!