Srimukhi , Megastar Chiranjeevi: చిరంజీవికి ఐ లవ్ యూ చెప్పిన స్టార్ యాంకర్ శ్రీముఖి.. మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ), కీర్తి సురేష్, తమన్నా భాటియా, శ్రీముఖి, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భోళా శంకర్( Bhola Shankar ).

మొహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించారు.త్వరలోనే ఈ సినిమా విడుదలకు అవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ( Pre Release Event )జరిగింది.

ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికి నమస్కారం.

"""/" / భోళా జీ ఐ లవ్ యూ జీ అంటూ చిరంజీవికి సిగ్నల్ ఇచ్చింది.

దాంతో సిగ్గుపడిన చిరంజీవి షార్ట్ కాలర్ అడ్డుపెట్టుకొని నవ్వుకొన్నారు.దాంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.

అనంతరం శ్రీముఖి( Srimukhi ) మాట్లాడుతూ.భోళా శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చిన మెహర్ రమేష్‌కు ధన్యవాదాలు.

నన్ను నమ్మినందుకు చాలా ధన్యవాదాలు.నన్ను అందంగా చూపించినందుకు ధన్యవాదాలు.

చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయి వచ్చాను.అంతా ఎగిరిపోయింది.

అయితే మీరు నేను, మ్యాచింగ్ వేసుకొన్నాము.అది తృప్తిగా ఉంది అని శ్రీముఖి సరదగా నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ఇకపోతే భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే. """/" / ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

మరి ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు అందుకున్న చిరంజీవి ఈ సినిమాతో ఏ మేరకు సక్సెస్ అందుకుంటారు చూడాలి మరి.

చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్