విలాసవంతమైన కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్?

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై అనేక షోలలో యాంకరింగ్ చేస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది శ్యామల.

అంతేకాకుండా ఈమె బిగ్ బాస్ సీజన్ 2 కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బుల్లితెరపై యాంకర్ లో ఎంత మంది ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్యామల.

టీవీ షోలతో పాటు లౌక్యం, ఒక లైలా కోసం లాంటి పలు చిత్రాల్లో కూడా నటించింది.

ఇది ఇలా ఉంటే యాంకర్ శ్యామల తాజాగా కొత్త ఇంట్లోకి మారింది.దీనికి సంబంధించిన గృహప్రవేశం వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసి నెటిజన్లు నూతన గృహంలోకి ప్రవేశించిన ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ వీడియోలో శ్యామల కొత్త ఇల్లు అద్భుతంగా ఉంది.ఇంటి మొత్తాన్ని కూడా పూలతో అలంకరించారు.

"""/"/ ఈ నూతన గృహ ప్రవేశానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీ తన భార్యతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.

అలాగే బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా దూసుకుపోతున్న యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాల, తనిష్, సింగర్ గీతామాధురి తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు వీడియోలకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ