హెయిర్ స్టైలిష్ట్ పరువు తీసింది.. యాంకర్ శ్యామల వీడియో వైరల్!
TeluguStop.com
తెలుగు యాంకర్లలో సుమ తరువాత అంతే అందం అభినయంతో స్పష్టమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకున్న వారిలో యాంకర్ శ్యామల ఒకరు.
ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం యాంకర్ గా మారిపోయారు.
ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల పలు కార్యక్రమాలకు, సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు, సక్సెస్ మీట్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ విధంగా యాంకర్ శ్యామల ఇండస్ట్రీలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్ర ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న శ్యామల మరొక సీరియల్ నటుడు నరసింహారెడ్డిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఆయనపై ఓ మహిళ చేసిన ఆరోపణల కారణంగా గత కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
అలాగే శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు.
అదే విధంగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.
"""/" /
ఇదిలా ఉండగా నిత్యం ఏదో ఒక కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉండే శ్యామల తాజాగా ఒక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ఈ వీడియో లో భాగంగా శ్యామల తన హెయిర్ స్టైలిష్ట్ పరువు మొత్తం తీసింది.
ఈ క్రమంలోనే ఈ వీడియోలో భాగంగా తన హెయిర్ స్టైలిస్ట్ తో మాట్లాడుతూ రాము కురులు అని వేటిని అంటారు.
అని అడగడంతో ఆయనకు కురులు అంటే వెంట్రుకలు అని అర్థం తెలియక తెల్లమొహం వేశాడు.
కురులు అంటే కూరలు అని అడగడంతో వెంటనే శ్యామల ఏ కూరలు అంటూ తన పరువు మొత్తం తీసింది.
ఈ క్రమంలోనే ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
తను ఒక హెయిర్ స్టైలిస్ట్ అయ్యిండి కురులు అంటే అర్థం తెలియకపోవడంతో చాలామంది ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇలా శ్యామల షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ విధంగా శ్యామల నిత్యం ఏదో ఒక వీడియో ఫోటోషూట్ ల ద్వారా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు.
గత కొద్ది రోజుల క్రితం శ్యామల ఎంతో ఖరీదైన పాలరాతి విల్లాను నిర్మించి గృహప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోని కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.
ఇలా బిగ్ బాస్ తర్వాత శ్యామల ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.
దానిమ్మ తొక్కలతో ఇలా చేశారంటే మచ్చలేని చర్మం మీ సొంతం!