రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన యాంకర్ శ్యామల … తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయంటూ?

అల్లు అర్జున్( Allu Arjun ) విషయంలో రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

ముఖ్యంగా ఆయన అరెస్టు విషయం పట్ల సినిమా సెలబ్రిటీలందరూ స్పందించారు కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ సైలెంట్ అయ్యారు.

ఈ క్రమంలోనే సినీనటి యాంకర్ వైకాపా ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల( Anchor Shyamala ) సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పై ఫైర్ అవుతూ చేసిన ట్వీట్  ప్రస్తుతం వైరల్ అవుతుంది.

"""/" / ఇలా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేసి తనని అరెస్టు చేయడం తన ఇంటిపై దాడి చేయడం పట్ల పెట్టడంతో ఈమె స్పందిస్తూ.

తెలంగాణ రాష్ట్రంలో( Telangana State ) ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా రేవంత్ రెడ్డి పదేపదే అల్లు అర్జున్ గారి అంశాన్ని హైలెట్ చేయడం సరైన విషయం కాదని తెలిపారు.

ఆ ఘటనను హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదు.మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, దృష్టి పెట్టాల్సింది ప్రజల సమస్యలపై, రాష్ట్ర పాలనపైనే.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

"""/" / నేతన్నలు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి సుమారు 50 మందికి పైగా గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తిని మరణించారు.

ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు? ఒక్కసారైనా మీరు ఈ కుటుంబాలని పరామర్శించారా వీరికి నష్టపరిహారం ఇచ్చారా అంటూ వరుసగా ప్రశ్నలు వేశారు.

అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ప్రభుత్వం పెట్టిన దృష్టి రాష్ట్రంలోనూ అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యల పై పెట్టాలని తెలిపారు.

ఇలా నేను వరుసగా ప్రశ్నలు వేయడంతో మీరు నాపై నోటీసులు లేదా అక్రమ కేసులు వేస్తారేమో అయినా సరే ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ శ్యామల చేసినటువంటి పోస్ట్ సంచలనగా మారింది.

ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నా.. దయచేసి సాయం చేయండి.. పావలా శ్యామల ఎమోషనల్!