పొట్టి బట్టలపై యాంకర్ ప్రశ్న.. అవమానంతో అనసూయ ఏం చేసిందంటే..?

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం బుల్లితెర లోనే కాకుండా వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

రెండు వైపులా సమానంగా క్రేజ్ ను అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ లేటు వయసులో కూడా తన గ్లామర్ ను మరింత పెంచుకుంటుంది.

ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ మొత్తానికి ఓ గుర్తింపు సాధించుకుంది.

ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా బుల్లితెర లో కూడా యాంకరింగ్ చేస్తూనే ఉంది.

ఇక తనకు సోషల్ మీడియా వేదికగా నెగటివ్ కామెంట్స్ వస్తే అస్సలు ఊరుకోదు.

ఇదిలా ఉంటే తను వేసుకునే దుస్తుల పట్ల యాంకర్ ప్రశ్నించడంతో తెగ అవమానంగా ఫీల్ అయింది.

"""/"/ తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.నిజానికి హైపర్ ఆది తన స్కిట్ లో భాగంగా ఎవరినో ఒకరిని గెస్ట్ గా పరిచయం చేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే ఈ ప్రోమో లో చూసినట్లయితే ఈసారి ఆది యాంకర్ శివను గెస్ట్ గా ఆహ్వానించాడు.

ఇక అందులో స్కిట్ అనంతరం శివ అనసూయ ను ఎప్పటి నుంచి ఒక ప్రశ్న అడగాలని ఉంది అనగా.

మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి.చిన్న చిన్న దుస్తులు ఎందుకు వేసుకుంటారని అందరూ అంటుంటారు అని అనడంతో.

వెంటనే అనసూయ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు అడిగారంటే అర్థం చేసుకోవచ్చు.మీరు ఇక్కడే ఉంటున్నారు.

"""/"/ మీకు ఇండస్ట్రీ గురించి తెలిసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు? అయినా ఇది నా పర్సనల్ అని సమాధానమిచ్చింది అనసూయ.

అంతటితో ఆగక మీ పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకని శివ అనడంతో వెంటనే అనసూయ మండిపోయి స్టేజి మీద నుండి కోపంతో వెళ్ళిపోయింది.

కోపంతో ఎవరెవరినో తీసుకువస్తారు అంటూ మండిపోయింది.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు