Anchor Ravi : న్యూస్ పేపర్ చదువుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన యాంకర్ రవి.. బాగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి సమయాన్ని, సందర్భాన్ని అస్సలు పట్టించుకోరు.

ఏ సమయంలోనైనా కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు బాత్రూంలో కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు.

ఎందుకంటే ఫోటోల మీద వాళ్లకు ఉన్న వ్యసనం అలాంటిది అని చెప్పాలి.ఫిమేల్ ఆర్టిస్టులే కాకుండా మేల్ ఆర్టిస్టులు కూడా ఫోటోలకు బాగా అలవాటు పడుతున్నారు.

ఇక అందులో ఒకరు యాంకర్ రవి( Anchor Ravi) అని చెప్పాలి.రవికి ఫోటో దిగడం అంటే చాలా ఇష్టం.

అందుకే సందర్భాలు, సమయాలు చూడకుండా ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటాడు.అయితే తాజాగా ఆయన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజెన్స్ నుండి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్( Tollywood) బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన మాటలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేశాడు రవి.అలా మంచి అభిమానం సంపాదించుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు రవి.

కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటుడుగా పరిచయమయ్యాడు.రవి తొలిసారిగా సంథింగ్ స్పెషల్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

"""/" / ఇక ఈ షోలో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5( Bigg Boss Season 5 ) లో అవకాశం అందుకున్నాడు.

అందులో తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకున్నాడు. """/" / ఇక రవికి గతంలోనే నిత్య( Nitya ) అనే అమ్మాయితో పెళ్లి జరగగా వాళ్లకి వియా అనే పాప కూడా ఉంది.

ఇక వీరిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు యాంకర్ రవి.

వాళ్ళు కూడా బుల్లితెరపై పలు షోలలో వచ్చి బాగా సందడి చేశారు.ఇక రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా మారాడు.

నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు. """/" / అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాడు.

కొన్నిసార్లు ఆ ట్రోల్స్ పై బాగా ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే పొద్దుపొద్దున్నే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు రవి.

ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

కొత్త చెప్పులు కొన్నాడు అందుకే ఫోటోలు దిగాడు అంటే ఒకరు కామెంట్ చేయగా.

అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నావు అంటూ మరొకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.న్యూస్ పేపర్ తో ఫొటోస్ బాగా వచ్చాయి అన్న అంటూ కొందరు వెటకారంగా కామెంట్లు చేశారు.

మరి కొంతమంది మీకు చదవడం కూడా వచ్చా అంటూ కామెంట్ చేశారు.

విదేశాల్లోనూ వీళ్ల గోలేనా.. భారతీయ కుటుంబంపై తీవ్ర విమర్శలు..!