వేదికపై రవిని అవమానించి పరువు తీసిన సన్నీ.. ఏం మారలేదంటూ కామెంట్స్?

బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన సన్నీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిత్యం యాంకర్ రవితో గొడవలు పడుతూ ఉండేవారు.

ఇలా వీరిద్దరి మధ్య ఏదో ఒక విషయం గురించి ఎన్నోసార్లు వివాదం చెలరేగింది.

ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరి మధ్య అలాంటి గొడవలు కొనసాగుతున్నాయని అర్థమవుతుంది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రవి సన్నీ పలు కార్యక్రమాలలో తప్ప వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు లేవు.

ఇకపోతే తాజాగా స్టార్ మా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కింగ్స్ వర్సెస్ క్వీన్ అని పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రవి యాంకర్ గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కింగ్స్ టీం నుంచి హమీదాకు జంతువులా అరవమని ఆర్డర్ వేశారు.

ఆమె అలా అరవనని చెప్పే సమయానికి గొడవ మొదలైంది.కింగ్స్ టీం నుంచి సన్నీ మాట్లాడుతూ ప్రతిసారి మేము చేయము అంటే ఎలా అంటూ క్వీన్ టీం పై విరుచుకుపడ్డారు.

"""/" / ఇలా కింగ్స్ వర్సెస్ క్వీన్ టీమ్ మధ్య వివాదం చెలరేగడంతో మధ్యలో రవి కల్పించుకొని సన్నీ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు.

రవి ఎంత చెబుతున్నప్పటికీ సన్నీ వినిపించుకోకుండా కాస్త పరిధి దాటి వ్యవహరించారు.ఏకంగా రవిని తోసుకుంటూ వెళ్లిపోవడంతో చివరికి రవి సన్నిధి మధ్య గొడవ మొదలైంది.

ఇలా వీరిద్దరి మధ్య గొడవ చేసుకోవడంతో వీరిని ఆపాలని ఎంత ప్రయత్నించిన వినడం లేదు రవి ఒకవైపే పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని తాను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నాడో ఇప్పటికి అలాగే పక్షపాతం చూపిస్తున్నారని తాను ఏ మాత్రం మారలేదు అంటూ ఏకంగా రవి పై సన్ని విరుచుకుపడ్డాడు.

తక్కువ బరువుతో స‌త‌మ‌తం అవుతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!