హాస్పిటల్ పాలైన యాంకర్ రష్మీ…. బాగానే ఉన్నానంటూ పోస్ట్! 

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మి (Rashmi)ఒకరు.

ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా పలు స్పెషల్ షోలలో కూడా సందడి చేస్తూ కెరియర్ పట్ల రష్మీ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ తరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా హాస్పిటల్ (Hospital)బెడ్ పై కనిపించడంతో అభిమానులు తనకు ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే రష్మి తన సర్జరీ,(Surgery) చాలా సక్సెస్ ఫుల్అయింది అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

"""/" / గత కొంతకాలంగా రష్మి భుజం నొప్పి సమస్యతో బాధపడుతున్నారు.ఈ సమస్య కారణంగా బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం అందరిలాగా తనకెంతో ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను అంటూ ఇదివరకు ఈమె ఒక పోస్ట్ చేశారు అయితే తాజాగా ఈ భుజం నొప్పికి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని రష్మీ సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తారు.నా హిమోగ్లోబిన్ 5 రోజుల్లో 9కి పడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను.

అలాంటి క్లిష్ట సమయంలో నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు.

"""/" / జనవరి నుంచి నాకు భుజం నొప్పి సమస్య ఉంది.అప్పటినుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను అన్ని పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 18వ తేదీ నేను సర్జరీ చేయించుకున్నానని సర్జరీ చాలా విజయవంతమైన తెలిపారు మూడు రోజులపాటు విశ్రాంతి తర్వాత తిరిగి తన పనులలో బిజీ కాబోతున్నానని రష్మి తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ పోస్ట్ చూసినా అభిమానులు తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లో చేస్తున్నారు.