యాంకర్ ప్రదీప్ అందుకే రెండో సినిమా లేట్ చేస్తున్నాడా..!

బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చాడు.

అయితే హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? అనే సినిమా తీసి హిట్ కొట్టాడు.

మున్నా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రదీప్ ని హీరోగా హిట్ ఖాతా తెరచేలా చేసింది.

అయితే ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ప్రదీప్ తన సెకండ్ సినిమా స్టార్ట్ చేయలేదు.

స్మాల్ స్క్రీన్ లో బిజీ బిజీగా ఉందని మొదలు పెట్టలేదా లేక హీరోగా ఎందుకు రిస్క్ అని భావించాడా అన్నది తెలియాల్సి ఉంది.

కేవలం సెలెక్టెడ్ కథలతోనే ప్రదీప్ సినిమాలు చేయాలని చూస్తున్నాడని కొందరు అంటున్నారు.ప్రదీప్ సెకండ్ సినిమా కోసం అతని స్మాల్ స్క్రీన్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఈమధ్య లైవ్ లో తన సెకండ్ సినిమా గురించి అడిగితే చేద్దాం దానికి తొందర ఎందుకు అన్నాడు.

అంటే ప్రదీప్ కి నచ్చే కథ దొరకట్లేదా లేక నిజంగానే ప్రదీప్ హీరోగా చేయడానికి ఆసక్తి చూపట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 ప్రదీప్ కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా మళ్లీ మరో డిఫరెంట్ స్టోరీతో రావాలని చూస్తున్నట్టు టాక్.

ఓరి దేవుడో.. కిమ్ జోంగ్ ఉన్ భార్య ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుందా..