యాంకర్‌ ప్రదీప్ హీరోగా ఓ రొమాంటిక్ లవ్‌ స్టోరీ..!

తెలుగు బుల్లి తెర పై తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్న యాంకర్ ప్రదీప్( Pradeep Machiraju ) ప్రస్తుతం చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాడు.

ఆయన ఇమేజ్ కి బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది.

ఆయన ఓకే అంటే పలు చానల్స్ కొత్త కార్యక్రమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.

కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం ఒక డాన్స్ షో ఇంకా మరో కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

మరో పక్క యాంకర్ రవి పలు కార్యక్రమాలతో దూసుకు పోతున్నా కూడా ప్రదీప్ మాత్రం చాలా తక్కువ కార్యక్రమాలు చేస్తున్నాడు.

"""/" / ప్రదీప్ చాలా తక్కువ కార్యక్రమాలు చేయడానికి కారణం ఆయన హీరో గా ఒక సినిమా చేయబోతున్నాడు.

ఆ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.గతం లో 30 రోజుల్లో ప్రేమించడం( 30 Rojullo Preminchadam Ela ) ఎలా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

హీరో గా ఆ సినిమా ప్రదీప్ కి సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు.

అందుకే కాస్త గ్యాప్ తీసుకొని హీరో గా రెండో సినిమా ను చేసేందుకు ప్రదీప్ రెడీ అయ్యాడు.

ఈ గ్యాప్ లో ఎన్నో కథ లను విన్న ప్రదీప్ ఎట్టకేలకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు.

"""/" / విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా ను నిర్మించబోతోంది.

ఇక ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ఈ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నాడట.

ఆ దర్శకుడు గతం లో రూపొందించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది.

అయినా కూడా యాంకర్ ప్రదీప్ ఈ సినిమా ను చేసేందుకు ఒప్పుకోవడానికి కారణం కథ అంటూ సమాచారం అందుతుంది.

అతి త్వరలోనే యాంకర్ ప్రదీప్ రెండవ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

మనుషులను చంపే తోడేలు కిరణ్ అబ్బవరం.. క మూవీ టీజర్ వేరే లెవెల్ లో ఉందిగా!