మెగా కోడలు మేఘన బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?
TeluguStop.com
మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల, యాంకర్ కమ్ హీరోయిన్ మేఘనల నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.
మెగా ఫ్యాన్స్ కు పవన్ తేజ్ కొణిదెల సుపరిచితమే అయినా మేఘన గురించి, మేఘన బ్యాగ్రౌండ్ గురించి ఎక్కువగా తెలియదు.
మేఘన తండ్రి పోలీస్ డిపార్టుమెంట్ కు చెందిన వ్యక్తి అని ఆయన పోలీస్ డిపార్టుమెంట్ లో ఉన్నత స్థానంలో ఉన్నారని సమాచారం అందుతోంది.
ఏపీలోని కాకినాడ మేఘన స్వస్థలం అని సమాచారం.హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన మేఘనకు బాల్యం నుంచి యాంకరింగ్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది.
పలు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించిన మేఘన ఆ ఈవెంట్ల ద్వారా ప్రశంసలను అందుకున్నారు.
కాకినాడలో మేఘన కుటుంబానికి ఊహించని స్థాయిలో ఆస్తులు ఉన్నాయని బోగట్టా.మేఘన కోటీశ్వరురాలు అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఆమె సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
హెచ్బీడీ హ్యాక్డ్ బై డెవిల్ మేఘన తొలి సినిమా కాగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా చాలామంది సినీ అభిమానులకు తెలియదు.
మేఘన తన తల్లీదండ్రులకు ఒకే ఒక్క కూతురు కావడం గమనార్హం.తొలి సినిమా తర్వాత ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాలో పవన్ తేజ్, మేఘన కలిసి నటించారు.
"""/"/
ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ తేజ్ వ్యక్తిత్వం మేఘనకు నచ్చగా మేఘన వ్యక్తిత్వం పవన్ తేజ్ కు నచ్చింది.
వీళ్లిద్దరి పెళ్లి తేదీకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.పవన్ తేజ్, మేఘన పెళ్లి చేసుకుని కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మెగా కోడలు కాబోతున్న మేఘన పెళ్లి తర్వాత కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!