యాంకర్ లాస్య ఇంట్లో తీవ్ర విషాదం.. ఎప్పటికీ మాతో ఉంటారంటూ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో లాస్య( Lasya ) ఒకరు.

ఈమె కెరియర్ మొదట్లో మ్యూజిక్ ఛానల్ యాంకర్ గా పనిచేశారు.అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ముఖ్యంగా లాస్య చీమ ఏనుగు కథలను చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి.

ఈ విధంగా యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి లాస్య అనంతరం మంజునాథ్( Manjunath ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

"""/" / ఈ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి ఈమె యాంకరింగ్ కి దూరంగా ఉంటున్నారు.

అయితే పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన భర్త పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే లాస్య పెళ్లి తర్వాత బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కూడా పాల్గొని మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నటువంటి లాస్య ఇంట తీవ్రవిషాదం నెలకొంది.

"""/" / తన భర్త అయినటువంటి మంజునాథ్ తండ్రి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా తన మామగారు( Father-In-Law ) మరణించడంతో లాస్య భర్త మంజునాథ్ అలాగే లాస్య తన మామయ్య ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీ ఆత్మకు శాంతి కలగాలంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

భౌతికంగా మీరు మాకు దూరమైనా మీ జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి అంటూ లాస్య తన మామయ్య ఆత్మకు శాంతి కలగాలని షేర్ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ఈ విషాద ఘటన నుంచి తొందరగా బయటపడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అభిమానికి మూడు లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన చిరు.. అలా చేసి మెగాస్టార్ అనిపించుకున్నారుగా!