అరియానాపై అందుకే కోపం అంటున్న యాంకర్ లాస్య?..!
TeluguStop.com
దశాబ్దకాలం క్రితం యాంకర్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది లాస్య.
యాంకర్ రవితో కలిసి చేసిన ప్రోగ్రామ్ లు, షోలు లాస్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
పెళ్లి తరువాత అడపాదడపా షోలలో లాస్య కనిపిస్తోంది.బుల్లితెరకు దూరంగా ఉన్నా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగత విషయాలను, విశేషాలను లాస్య అభిమానులతో పంచుకుంటోంది.
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని గత వారం ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన లాస్య అరియానాపై తనకు ఎందుకు కోపమో తాజాగా వెల్లడించింది.
బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ లో రాహుల్ సిప్లిగంజ్ తో మాట్లాడుతూ అరియానాపై తనకు వ్యక్తిగతంగా కోపం లేదని తెలిపింది.
అరియానా మానసికంగా ఎంతో స్ట్రాంగ్ అని.లుక్స్ లోనే కాకుండా మాటల్లో కూడా బోల్డ్ గానే ఉంటుందని.
తనలో ఎన్నో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయని తెలిపింది.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో నామినేషన్ల సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు వచ్చాయని లాస్య పేర్కొంది.
"""/"/
ఒకసారి టాస్క్ సమయంలో అరియానా తనను కావాలని నామినేట్ చేసిందని.హౌస్ లో అంతమంది కంటెస్టెంట్లు ఉండగా తననే ప్రత్యేకంగా నామినేట్ చేయడానికి కారణం తనకు అర్థం కాలేదని తెలిపింది.
నామినేషన్ల విషయం గురించి వదిలేస్తే మిగతా సమయాల్లో తను ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని.
బిగ్ బాస్ నిబంధనలను సరిగ్గా పాటిస్తుందని.టాస్క్ ల విషయంలో మాత్రం హ్యూమానిటీని మరిచిపోయి రూల్స్ కే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో ఒకసారి అరియానా తనకు పోటీ కాదని తాను అన్నానని.
తనను నామినేట్ చేసిన సమయంలో అరియానా చేసిన వ్యాఖ్యల వల్ల తాను అలా చెప్పానని చెప్పింది.
బిగ్ బాస్ షో లో అరియానా వ్యవహరించిన తీరు వల్ల తనపై కోపం వచ్చిందని అంతకు మించి గొడవలు లేవని లాస్య తెలిపింది.
గుండెలు గుభేల్: మహాకుంభమేళాలో 100 అడుగుల పాము ప్రత్యక్షం.. వైరల్ వీడియోలో ట్విస్ట్!