Anchor Jhansi : రోడ్డుపై చెత్తను ఏరుకుంటున్న యాంకరమ్మ… ఎందుకో తెలుసా?
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) ఒకరు.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.
అయితే యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో అవకాశాలను కూడా అందుకుంటూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.
ఇక ఇటీవల కాలంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.కేవలం సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
"""/" /
ఇక ఇటీవల ఈమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇకపోతే తాజాగా ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా ఈమె రోడ్డుపై కనిపించిన చెత్తను( Garbage ) మొత్తం ఏరుకుంటూ తన కారులో వేస్తున్నారు.
ఇలా రోడ్డుపై కనిపించిన చెత్తను ఈమె ఏరుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఎందుకు తను అలా చేస్తున్నారనే విషయాలను కూడా ఝాన్సీ వెల్లడించారు.
"""/" /
ఈమె రోడ్డుపై పడి ఉన్నటువంటి ఎండు గడ్డి, ఎండిపోయిన ఆకులను మొత్తం ఏరి తన కారులోకి పెడుతున్నారు.
సాధారణంగా ప్రకృతి( Nature ) నుంచి లభించిన వస్తువులు తిరిగి ప్రకృతికి ఎంతగానో ఉపయోగపడతాయనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఝాన్సీ సైతం ఇలా ఎండిపోయిన ఆకులు ఎండు గడ్డిని కాల్చి బూడిద చేయకండి.
అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి.అవి ప్రకృతి సమతౌల్య సూత్రం అంటూ పేర్కొన్నారు.
ఇలా తిరిగి ప్రకృతిని కాపాడటానికి ఈమె ఇలా చేస్తున్నారనే విషయం తెలిసి అందరూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్…