Anchor Jhansi: వైరల్ అవుతున్న ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్.. ఆ వ్యక్తి మృతితో మాటలు రావడం లేదంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కడ లేదు.
కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఎన్నో సినిమాలు అందులో నటించి మెప్పించింది.
అలాగే అప్పట్లో ఎన్నో షోలకు సినిమా ఆడియో ఫంక్షన్లకు( Audio Functions ) యాంకరింగ్ చేసి యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అలా ఎంతోమందిని తన యాంకరింగ్ తో అలరించి యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంది.
అయితే తన తోటి యాంకర్ ను వివాహం చేసుకొని కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆమె ఆ తరువాత విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకుని తన లైఫ్ తాను బతుకుతోంది.
"""/" /
అయితే తాజాగా ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే.ఝాన్సీ వద్ద పని చేసే ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్( Cardiac Arrest ) కారణంగా మరణించారు.
దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
శ్రీను, శీను బాబు( Srinu ) అని నేను ముద్దుగా పిలుచుకునే నా మెయిన్ సపోర్ట్ సిస్టమ్ ఇతను.
హెయిర్ స్టైలిస్ట్‌గా నా దగ్గర పని చేయడం మొదలు పెట్టి నా పర్సనల్ సెక్రటరీ( Personal Secretary ) స్థాయికి ఎదిగాడు.
నా పనిని ఎప్పటికప్పుడు చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. """/" /
అతను నా ఉపశమనం, వర్క్ బ్యాలెన్స్, తెలివి అలాగే బలం.
అతను చాలా సున్నితమైనవాడు, నిజమైనవాడు, దయగలవాడు, చమత్కారమైన హాస్యం కలిగి ఉంటాడు.అతను నా స్టాఫ్ కంటే ఎక్కువ, అతను నాకు తమ్ముడు లాంటి వాడు.
35 సంవత్సరాల వయసులో భారీ కార్డియాక్ అరెస్ట్‌తో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.నేను చాలా బాధలో ఉన్నాను, మాటలు రావడం లేదు.
జీవితం ఒక నీటి బుడగ లాంటిది అని అంటూ ఆమె రాసుకొచ్చారు.ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
శంకర్ చేసిన మిస్టేక్స్ వల్లే గేమ్ చేంజర్ రిజల్ట్ ఇలా వచ్చిందా..?