నీకు అమ్మాయిల పిచ్చి ఉందా అంటూ సూటి ప్రశ్న వేసిన యాంకర్.. డీజే టిల్లు ఏం చెప్పాడంటే?
TeluguStop.com
ఒకప్పుడు సినిమా అంటే హీరో హీరోయిన్లు ప్రేమించు కోవడం పెద్దల సమక్షంలో వారి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ కథా చిత్రాలుగా సాగిపోయేవి.
అయితే రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోవడంతో ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా దర్శక నిర్మాతలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చే సినిమాలలో కాస్త రొమాన్స్ ఎక్కువగానే ఉందని చెప్పాలి.
యువత కూడా ఇలాంటి సినిమాలను ఎక్కువగా చూడటం వల్ల ప్రస్తుత సినిమాలలో కాస్త రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలలో హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా ఇద్దరి తోనూ బూతు పదాలు మాట్లాడించడం లేదా లిప్ లాక్ సన్నివేశాలు పెట్టడం వంటి రొమాంటిక్ సన్నివేశాలతో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే సిద్దు జొన్నల గడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డిజే టిల్లు.
ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ జొన్నలగడ్డ యాంకర్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
"""/" /
ఈ సందర్భంగా యాంకర్ సిద్దు జొన్న గడ్డలను ప్రశ్నిస్తూ.సినిమాలలో మంచి గుర్తింపు పొందడం కోసం రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం, లిప్ లాక్ సన్నివేశాలు అనేవి సులువైన మార్గాలని అనుకుంటున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సిద్ధూ సమాధానం చెబుతూ అవన్నీ మీరు అనుకున్నట్టు పెద్ద విషయం కాదు కానీ మనమంతా అలాంటి సన్నివేశాలను బోల్డ్ సన్నివేశాలు అని అనడంతో అది కాస్తా చాలా పెద్ద విషయంగా కనబడుతుందని ఈ హీరో సమాధానం చెప్పారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు లిప్ లాక్ సీన్స్ కనిపించడంతో హీరో సిద్దుకి ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక ఇదే ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ హీరోని ప్రశ్నిస్తూ మీకు నిజ జీవితంలో కూడా అమ్మాయిల పిచ్చి ఉందా అని ప్రశ్నించారు.
అయితే ఈ పదాన్ని ఇంగ్లీషులో అడుగుతూ మీరు ఉమనైజరా? అంటూ ప్రశ్నించడంతో వెంటనే సిద్దు అసలు ఉమనైజరా అంటే అర్థం ఏంటో చెబుతారా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇలా యాంకర్ ని తిరిగి సిద్ధూ ప్రశ్నించడంతో ఈ ఇంటర్వ్యూ కాస్త ఆసక్తికరంగా మారింది.
"""/" /
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ కొండేటి సురేష్ హీరోయిన్ పుట్టు మచ్చల గురించి అడగడంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారిన విషయం మనకు తెలిసిందే.
సిద్దు నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీ విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సమస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
మరి థియేటర్లో ఈ సినిమా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్7, గురువారం 2024