అక్కడ అందరి ముందు దుస్తులు మార్చుకోవాలి.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

వింధ్య విశాఖ మేడపాటి( Vindhya Vishaka Medapati ).రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఎంతోమంది ప్రేక్షకులను యాంకర్ గా( Anchor ) మంచి గుర్తింపు తెచ్చుకుంది వింధ్య.

దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కి నెట్టి మరీ వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకుంది.

ఈ విషయంలో సరికొత్త రికార్డును కూడా సృష్టించింది.స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగ మ్మాయి.

ఐపీఎల్‌ సీజన్‌ 11( IPL Season 11 ) నుంచి హోస్ట్‌గా క్రికెట్‌ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది.

"""/"/ ఇది ఇలా ఉంటే తాజాగా తన మోడలింగ్‌( Modeling ) రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది.

అంతేకాకుండా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.తాజాగా ఆమె మాట్లాడుతూ.

మగవారు మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ క్రికెట్‌ రంగంలోకి మా కుటుంబ సభ్యుల ప్రోత్సహం వల్లే నేను కెరీర్‌లో రాణించగలుగుతున్నాను.

డిగ్రీ సెకండియర్‌ లో ఉన్నప్పుడు మొదట న్యూస్‌ ప్రజెంటర్‌గా, మోడల్‌ గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని మా అమ్మగారి షరతు పెట్టడంతో ఎం.

ఏ ఇంగ్లీష్‌ పూర్తి చేశాను.ఆ తర్వాత కొంతకాలం పాటు మోడలింగ్‌లో కూడా శిక్షణ పొందాను.

అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నాను. """/"/ అలా నేను కొన్నిసార్లు విన్నర్‌గా కూడా రాణించాను అని తెలిపింది.

దీంతో ఎలాగైనా మోడలింగ్‌ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయన తర్వాత మోడలింగ్‌ లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్‌ వీక్‌( Fashion Week )లో నేను పాల్గొన్నాను.

అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ షో గా నా కెరియర్‌లో మిగిలిపోయింది.

అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్‌ కాదని అనుకున్నాను.

ఆ ఫ్యాషన్‌ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులు కూడా లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది వింధ్య.

బ్యాక్‌ స్టేజ్‌ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది.అది చూసి కొంత సమయం పాటు షాకయ్యాను.

ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాను ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్‌ కాదని అనిపించింది.

ఆ ఒక్క షో వల్ల మోడలింగ్‌ ను వదిలేశాను.ఇది నాకు ఎదురైన అనుభవం అని తెలిపింది వింధ్య.

అన్ని చోట్లా ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు అని వింధ్య తెలిపారు.

ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్లు ఎంతో మీకు తెలుసా.. భారీగానే తీసుకుంటున్నారుగా!